MP Navneet Kaur:మంత్రి రోజాకు మద్దతుగా ఎంపీ నవనీత్ కౌర్.. బండారు వ్యాఖ్యలపై మండిపాటు

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీనియర్ నటి కవిత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్భూ, మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.. రోజాకు మద్దతుగా బండారు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ హీరోయిన్, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా రోజాకు అండగా నిలిచారు.

మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..?

అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క వీడియో చూశాను. అందులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజా గారి పట్ల చేసిన వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయాను. రోజా గారు ఒకప్పుడు హీరోయిన్‌గా పనిచేశారు. పెద్ద పెద్ద హీరోలతో నటించారు. ఇప్పుడు రాజకీయాల్లో మంత్రిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల ఇలాంటి కామెంట్స్ చేయడానికి ఎంత ధైర్యం కావాలి. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? రాజకీయాల్లో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణం. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ బండారు వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. మీకు అసలు సిగ్గులేదా..? తక్షణమే రోజాకు క్షమాపణలు చెప్పాలి. రోజా గారు మీకు దేశంలోని మహిళలందరూ అండగా ఉంటారు అని నవనీత్ కౌర్ ఓ వీడియో విడుదల చేశారు.

More News

Sharmila:కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి బ్రేకులు.. షర్మిల ఒంటరి అయిపోయారా..?

ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయగా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Jagananna Arogya Suraksha: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా దూసుకెళ్తోన్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

Varun Tej Lavanya Tripathi:వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. చిరంజీవి ఇంట్లో మెగా ఫ్యామిలీ సందడి, ఫోటోలు వైరల్

మెగా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. త్వరలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే.

TDP:టీడీపీ వస్తే మన పరిస్థితేంటి..? వైసీపీ నేతల్లో కలవరం ఎందుకు మొదలైంది..?

వైనాట్ 175.. ఇది కొన్ని నెలలుగా సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతల నినాదం. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 తామే గెలుస్తామని హోరెత్తిస్తు్న్నారు.

Modi:ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోదీ హర్షం

ఆసియా క్రీడల్లో భారత్ జట్టు విజయ దందుభి మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పతకాల వేట కొనసాగిస్తోంది.