జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎంపీ కేశినేని ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత నెట్టింట చురుగ్గా ఉంటున్న నాని ప్రత్యర్థి పార్టీల నేతలను.. సొంత పార్టీల నేతలనూ వదలకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ పార్టీ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిన సందర్భాలున్నాయి. మరీ ముఖ్యంగా ఈయన ప్రత్యర్థి, వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన పీవీపీతో పాటు పలువురు వైసీపీ నేతల గురించి విమర్శనాస్త్రాలు విసిరారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో గానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ఓ కీలక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అటు సోషల్ మీడియాలో.. ఇటు టీడీపీలో చర్చనీయాంశమైంది.
నాని ట్వీట్ సారాంశం ఇదీ..!
"సీఎం గారు... మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి" అని వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేస్తూ నాని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు పలువురు వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఎంపీ అయ్యుండి.. జగన్ నిర్ణయాలను స్వాగతించడమేంటి..? అని కన్నెర్రజేస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంతో గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
సీఎం గారు @ysjagan మీరు తీసుకున్న ఈ నిర్ణయంను నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక యితర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి pic.twitter.com/JK0QBHdLnJ
— Kesineni Nani (@kesineni_nani) August 9, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments