బీజేపీ ఎమ్మెల్యేను బూటుతో కొట్టిన ఎంపీ..
Send us your feedback to audioarticles@vaarta.com
జడ్పీటీసీ సమావేశాలు మొదలుకుని అసెంబ్లీ సమావేశాల వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపించుకుంటారో మనందరం చూసే ఉంటాం. ముఖ్యంగా ఇక డిబెట్స్‌లో అయితే ఒక్కోసారి కొట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్తుంది. ఇదిగో ఈ వార్త చదివిన తర్వాత ఈ ఇద్దరు నేతలను ఛీ కొడతారేమో.!.
ఇదిగో ఫొటోలు చూస్తున్న ఈ ఇద్దరు నేతలు ప్రజల చేత.. ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లిన వారే. అయితే బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సహనాన్ని కోల్పోయి అసలు తామేం చేస్తున్నామో ఎరుగక అడ్డంగా కెమెరాల కంటపడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కరీబ్‌నగర్‌లో మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ్ హాజరయ్యారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వీరిద్దరి మధ్యలో ఒక సీనియర్ నేత ఎవరో ఉన్నారు. ఏదో విషయం ఇద్దరు మాట్లాడుతుండగా అది కాస్త వివాదానికి తావిచ్చింది. ఇలా మాటామాటా పెరిగి.. పరిస్థితి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అప్పటికే ఇటు ఆ ఇద్దరికీ పక్కనే కూర్చున్న పెద్దలిద్దరూ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఒకానొక దశలో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎంపీ.. కిందికి వంగి బూటు తీసుకొని పక్కనే ఎమ్మెల్యే మూతికేసి చితక్కొట్టారు.
కోప్రోదిక్తులైన ఎమ్మెల్యే పైకి లేచి.. నన్నే కొడతావా..! అని తిరగబడి ఆ ఎంపీ చెంప చెల్లుమనిపించారు. ఇంతలో ఓ పోలీసు అధికారి, పక్కనే ఉన్న మరికొందరు లేచి గొడవకు ఫుల్ స్టాప్ ప్రయత్నం చేశారు. ఇక్కడ అసలు విషయమేంటంటే.. ఈ ఇద్దరి మధ్య కూర్చోనున్న పెద్ద మనిషి మంత్రి అశుతోష్. ఆయన సమక్షంలో వీరిద్దరూ బాహాబాహికి తిగి ఇలా చేయడం గమనార్హం. అంతేకాదండోయ్.. వీరిద్దరూ ఒకే పార్టీ బీజేపీకి చెందిన వారే. మరోవైపు ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. మీకు అవకాశం వచ్చింది కదా అని ఇలా రెచ్చిపోయారు.. మాకు టైమొస్తుంది.. అప్పుడు మేం ప్రతీకారం తీర్చుకుంటామని ఎమ్మెల్యే అనుచరులు, పలువురు మద్దతురాలు ఆ ఎంపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పెద్దలు స్పందించరేం..!
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల కంటే వీధి రౌడీలే నయమన్నట్లుగా ప్రవర్తించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. నలుగురిలో హుందాగా ప్రవర్తించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. అయితే ఇంత జరిగినా.. సీఎం కానీ.. అటు ప్రధాని కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. కాగా ఇలా కమలనాథులు కొట్టుకోవడం కొత్తేమీ కాదు.. అయితే మునుపటిలాగే సిల్లీగా తీసుకొని ఈ వ్యవహారాన్ని పక్కన పడేస్తారో లేకుంటే సీరియస్‌గా తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments