MP Balasouri: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి బందర్ ఎంపీ బాలశౌరి రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి అసలు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే నేతలంతా పార్టీకి రాజీనామాలు చేయడం సంచలనంగా మారుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి గుడ్ బై చెప్పడం వైసీపీలో కలవరం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. దీంతో త్వరలోనే జనసేనలో లేదా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
బాలశౌరికి టికెట్ ఇవ్వకుండా ఇతర నేతకు టికెట్ ఇవ్వాలని జగన్ ఆలోచించడంతోనే ఆయన కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన రాజీనామాతో అన్యుహంగా ముస్లిం మైనార్టీ నాయకుడు పేరు తెరపైకి వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడు, జగన్‌కు నమ్మినబంటు అయిన అయుబ్ ఖాన్‌ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ యోచిస్తున్నారని సమాచారం. మరోవైపు మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని కూడా ఆలోచిస్తున్నారట. కాగా పేర్ని నాని-బాలశౌరి మధ్య గత కొంతకాలంగా మధ్య విభేదాలీఉ నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ తర్వాత మరికొంత మంది నేతలు పార్టీకి రాజీనామా చేయనన్నారట. ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసాథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి లాంటి వారు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. మొత్తానికి కీలక నేతల రాజీనామాతో ఎన్నికల వేళ అసలు పార్టీ ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments