MP Balasouri: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి బందర్ ఎంపీ బాలశౌరి రాజీనామా..

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి అసలు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే నేతలంతా పార్టీకి రాజీనామాలు చేయడం సంచలనంగా మారుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి గుడ్ బై చెప్పడం వైసీపీలో కలవరం రేపుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. దీంతో త్వరలోనే జనసేనలో లేదా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

బాలశౌరికి టికెట్ ఇవ్వకుండా ఇతర నేతకు టికెట్ ఇవ్వాలని జగన్ ఆలోచించడంతోనే ఆయన కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన రాజీనామాతో అన్యుహంగా ముస్లిం మైనార్టీ నాయకుడు పేరు తెరపైకి వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడు, జగన్‌కు నమ్మినబంటు అయిన అయుబ్ ఖాన్‌ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ యోచిస్తున్నారని సమాచారం. మరోవైపు మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని కూడా ఆలోచిస్తున్నారట. కాగా పేర్ని నాని-బాలశౌరి మధ్య గత కొంతకాలంగా మధ్య విభేదాలీఉ నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ తర్వాత మరికొంత మంది నేతలు పార్టీకి రాజీనామా చేయనన్నారట. ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసాథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి లాంటి వారు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. మొత్తానికి కీలక నేతల రాజీనామాతో ఎన్నికల వేళ అసలు పార్టీ ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

More News

తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన అంగన్‌వాడీలు

కొద్ది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉంది.

Chandrababu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఎందుకంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడ తులసీనగర్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.

Pandem Kollu: కాలు దువ్వుతున్న పందెంకోళ్లు.. చేతులు మారనున్న కోట్ల రూపాయలు..

సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ముగ్గులు, గొబెమ్మలు. ఇవే కాకుండా ముందుగా వినపడేది కోడిపందాలు.

First Day Collections: 'గుంటూరుకారం' వర్సెస్ 'హనుమాన్'.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం'బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మహేష్ వన్ మ్యాన్‌ షోతో అలరిస్తున్నాడు.

YS Sharmila: చంద్రబాబును కలిసిన షర్మిల.. కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం..

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను కాంగ్రెస్ నాయకురాలు వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు