డైరెక్టర్, రైటర్‌కు మధ్య గొడవ.. ఆగిన సినిమా..
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ త్రినాథరావు అంటే మనకు గుర్తుకు వచ్చే సినిమాలు.. మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తమావ, నేను లోకల్, హలోగురూ ప్రేమకోసమే సినిమాలు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఈ సినిమాల విజయంలో హీరోల పార్టిసిపేషన్ అనే అంశాలను పక్కన పెడితే.. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ ప్రసన్నకుమార్ల పాత్ర ఏంతో ఉంది. వీరిద్దరూ పాలు నీళ్లులా కలిసిపోయి ఈ సినిమాలను తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవైందట. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ మాత్రం కాదట. రెమ్యునరేషన్స్ విషయంలో వచ్చిన గొడవల కారణంగానే ఇద్దరూ విడిపోయారని టాక్.
వివరాల్లోకెళ్తే.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడట. ఈ సినిమా కోసం ఇద్దరికీ ఐదు కోట్ల రూపాయలు కావాలన్నారట. అందులో తనకు సగం డబ్బులు కావాలని ప్రసన్నకుమార్ చెప్పాడట. అయితే త్రినాథరావు అందుకు ఒప్పుకోలేదట. అందుకే ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయట. ఇద్దరూ విడిపోయారట. ఇప్పుడు ప్రసన్నకుమార్ డైరెక్టర్‌గా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటుంటే, త్రినాథరావు మరో రైటర్‌ను వెతుక్కునే పనిలో ఉన్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments