'కీచక' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
మహాభారతంలో కీచక అనే క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్. అడవాళ్లను అత్యాచారాలు చేసే ఈ కీచకుడుకి పాండవులు బుద్ధి చెబుతారు. ఇది మన పురాణం. మన పురాణంలో ఒక కీచకుడే కనపడతాడు. అయితే నేటి సమాజంలో ఎంతో మంది కీచకులు సంచరిస్తున్నారు. స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నారు. నాగపూర్ బస్తీలోని జరిగిన ఓ నిజఘటన, ఓ కీచకుడి కథనే దర్శక, నిర్మాతలు కీచక సినిమాగా రూపొందించారు. ఈ కీచక సినిమాతో దర్శక నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారో తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళదాం..
కథ-
హైదరాబాద్ లోని ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసే సుజాత(యామినీ భాస్కర్) మూడు నెలలు లీవ్ పెట్టి గాంధీనగర్ బస్తీకి వస్తుంది. అక్కడ కోటి(జ్వాలా కోటి) అనే రేపిస్ట్ ను చంపడమే ధ్యేయంగా అందరూ వద్దన్నా వినకుండా బస్తీలోనే ఉంటుంది. బస్తీలో సూరి అనే ఆటోడ్రైవర్ సుజాతకు హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. మూడు వందల మందిని రేప్ చేసిన కోటి ఓ సందర్భంలో సుజాతను చూసి ఆమెను రేప్ చేయాలనుకుని ఆమెను ఎత్తుకొచ్చేస్తాడు. చివరకు ఏమౌతుంది? సుజాతను ఎలా తప్పించుకుంది? బస్తీలోని ప్రజలు ఎలా తిరగబడ్డారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి.
సమీక్ష-
సుజాతగా నటించిన యామినీ భాస్కర్ తన పాత్ర వరకు చక్కగానే నటించింది. విలన్ చిత్ర హింసలు పెట్టినా భరించే సన్నివేశాలు, విలన్ ను ఎదిరించి సన్నివేశాల్లో బాగానే నటించినా హావభావాల విషయంలో మరింత బాగా చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ పాత్రను ఎవరైనా సీనియర్ నటి చేసుంటే ఇంకాస్తా బెటర్ పెర్ ఫార్మెన్స్ వచ్చుండేది కదా అనిపించింది. ఇక చెప్పుకోవాల్సింది టైటిల్ రోల్ పోషించిన జ్వాలా కోటి గురించి, కీచక పాత్రలో మంచి నటనను కనపరిచాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. బస్తీలో ఇడ్లీలు అమ్మే పాత్రలో రఘుబాబు, మినిష్టర్ పాత్రలో కనపడే గిరిబాబు, వినోద్, అప్పారావు, రోజా ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు ఎన్.వి.బి.చౌదరి గురించి చెప్పాలంటే ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడనేది క్లారిటీగా చెప్పలేకపోయాడు. రేప్ లపై పెట్టిన శ్రద్ధ కాస్తా కంటెంట్ ను ఎమోషనల్ గా తీసుకెళ్ళే విషయంలో చూపించి ఉంటే బాగుండేది. అవయవాలను కోసేసే సన్నివేశాలు, ఆడపిల్లలను విలన్ సిగరెట్స్ తో కాల్చేసే సన్నివేశాలు చూస్తుంటే ఇదేంట్రాబాబు అనిపిస్తుంది. దర్శకుడు క్లయిమాక్స్ ను అనుకున్నంత ఎఫెక్టివ్ గా మలచలేకపోయాడు. జోశ్యభట్ల సంగీతం ఆకట్టుకోలేకపోయింది. కమలాకర్ సినిమాటోగ్రఫీ కూడా మెప్పించలేదు. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకుడిని టచ్ చేసేలా లేవు.
విశ్లేషణ-
ఓ నిజఘటనను తెరకెక్కించాలనుకున్నప్పుడు ఆ కంటెంట్ లోని వాస్తవికతతో పాటు, దానికి ఎమోషనల్ అంశాలను కూడా జోడించాలి అప్పుడే ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ అవుతాడు. ఆ విషయంలో మిస్ ఫైర్ అయింది. ఒకట్రెండు ఎమోషనల్ విషయాలను టచ్ చేశారే తప్ప ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడని చెప్పలేం.
బాటమ్ లైన్-
ఎమోషన్ ఎక్కడ...కీచక?
రేటింగ్ – 1.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com