సాఫ్ట్ వేర్ స్కాండల్ పై చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో ఒకప్పుడు సత్యం అంటే ఓ పేరుండేది. ఆ సంస్థ అధినేత సత్యం రామలింగరాజు నిధులను దుర్వినియోగం చేశారు. దాంతో ఆ కంపెనీ మూత పడింది. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దేశ చరిత్రలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ స్కామ్‌గా ఇది నిలిచిపోయింది.
ఇప్పుడు ఆ స్కామ్ ఎలా జరిగిందనే ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో సత్యం రామలింగరాజు పాత్ర ప్రధానంగా ఉంటుంది.
బాలీవుడ్‌లో లంచ్‌బాక్స్ అనే సినిమా కో ప్రొడ్యూసర్ అరుణ్ రంగాచారి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments