స్నేహం వైరంగా ఎలా మారింది?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇద్దరు స్నేహితులు విరోధులుగా మారడానికి పరిస్థితులు కారణమవుతుంటాయి. అలాంటి పరిస్థితులు ఇద్దరి ముఖ్యమంత్రల మధ్య ఉన్న స్నేహాన్ని వైరంగా ఎలా మార్చాయి? అనే పాయింట్‌తో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రెండు వేర్వేరు పార్టీలకు చెందినవారు. కానీ వీరిద్దరూ ఓకే రాజకీయ పార్టీలో ఒకేసారి తమ రాజకీయ ఓనమాలను దిద్దారు. అయితే క్రమంగా పార్టీలు, వాటి సిద్ధాంతాలు కారణంగా ఇద్దరు స్నేహితుల మార్గాలు ఎలా మారాయి రాజకీయ వైరం ఎలా ఎలా పెరిగిందనే అంశాలతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు విష్ణు ఇందూరి, తిరుమల రెడ్డి.
ఈ సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 1980 నుండి 2000 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకునే ఈ ఫిక్షనల్ కథను రూపొందిస్తారట. మరి ఇందులో ఎవరు నటిస్తారనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పేలా లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, 83 వంటి బయోపిక్ చిత్రాలను నిర్మిస్తున్న విష్ణు ఇందూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com