గజదొంగ బయోపిక్ పై...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో బయోపిక్‌ల హవా పెరుగుతుంది. తెలుగులో అబ్దుల్ కలామ్, ఎన్టీఆర్, కె.సి.ఆర్, చిరంజీవి ....జీవిత చరిత్రలు సినిమాల రూపంలో రానున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే..ఇప్పుడు ఓ గజదొంగ జీవిత చరిత్ర సినిమా రూపంలో రానుంది. 1970 దశకంలో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన పేరు మోసిన దొంగ నాగేశ్వరావు జీవితంపై సినిమా రానుంది.
స్టూవర్టుపురం ప్రాంతంలోని నాగేశ్వరరావు చాలా తెలివిగా దొంగతనాలు చేసేవాడు. పోలీసులు అరెస్టు చేసిన తెలివిగా తప్పించుకునేవాడు. ఇతన్ని అందరూర టైగర్ నాగేశ్వరరావు అని పిలిచేవారు. 1978లో ఈయన్న పోలీసులు కాల్చి చంపేశారు.
ఇప్పుడు ఈయన జీవిత కథను సినిమా రూపంలో తేనున్నారు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల డైరెక్టర్ వంశీకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మిస్తాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments