పీతపై సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
ఈగ సినిమాతో రాజమౌళి ఈగకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. గతంలో పాము, ఏనుగు వంటి ఎన్నోజంతువులపై సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. అయితే విజువల్ వండర్‌గా వచ్చిన ఈగ సినిమా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో దర్శకుడు రవిబాబు పందిపిల్లపై వరాహం సినిమాను తెరకెక్కించాడు. ఈసినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఇప్పుడు తమిళంలో పీతపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నాడు. పూనం కౌర్ హీరోయిన్గా నటిస్తుంది. ఓ అమ్మాయికి సముద్రతీరంలో ఓ పీతతో స్నేహం ఏర్పడుతుంది. ఓ రోజు ఆ అమ్మాయి ప్రేమికుడు కనపడకుండా పోతాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి పీతతో చెబుతుంది. అప్పుడు పీత ఎలాంటి సాహసం చేసిందనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందట. తన ప్రేయసి ఏం కాకుండా విలన్ బారి నుండి కాపాడుకునే ఈగను చూశాం. ఇప్పుడు పీత తన స్నేహితురాలి కోసం ఏం చేసిందనేది సినిమాలో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com