మూవీ రిలీజ్ కాకుండానే 100 కోట్లు..!
Saturday, November 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ రిలీజ్ కాకుండానే 100 కోట్ల బిజినెస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా సింగం 3. సూర్య హీరోగా హరి సింగం 3 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. అయితే...ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో 100 కోట్ల బిజినెస్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో సింగం 3 మూవీ రైట్స్ కు 42 కోట్లు, కర్నాటకతో పాటు మిగిలిన ఏరియాలో రిలీజ్ కానున్న తమిళ వెర్షెన్ కోసం 5 కోట్లు బిజినెస్ జరిగిందట.
ఇక మలయాళం వెర్షెన్ రైట్స్ ను సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ 10 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. తెలుగు రైట్స్ ను దాదాపు 25 కోట్లుకు మల్కిపురం శివకుమార్ సొంతం చేసుకున్నారని తెలిసింది. ఓవర్ సీస్ రైట్స్ & శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే దాదాపు 100 కోట్లు పైగానే బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ విధంగా రిలీజ్ కు ముందే 100 కోట్లు బిజినెస్ చేస్తే...ఇక రిలీజ్ తర్వాత సింగం 3 ఎంత కలెక్ట్ చేస్తుందో..? ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments