స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో

  • IndiaGlitz, [Monday,December 03 2018]

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. గ‌త ఏడాది 'మెర్స‌ల్‌'(తెలుగులో అదిరింది) వంటి చిత్రాన్ని తెర‌కెక్కించి హ్యాట్రిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

మ‌రోసారి విజ‌య్‌, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతుంది. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఎ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోర‌మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. ఇందులో విజ‌య్ కోచ్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది.