అయోధ్య రాములోరి సేవలో సినీ ప్రముఖులు
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపించింది. మరికొద్ది సేపట్లో జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన జరగనుంది. కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్ శాస్త్రి లక్ష్మీకాంత్ దీక్షితులు ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు అయోధ్యకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించారు.
దీంతో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన సినిమా సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సైనా నెహ్వాల్, సీఎం యోగి, సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు.. ఇలా చాలా మంది ప్రముఖులు విచ్చేశారు.
వీరితో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భారీగా ప్రముఖులు అయోధ్యకు చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 13 వేల మంది భద్రతా బలగాలు అయోధ్య చుట్టూ పహారా కాస్తున్నాయి. యూపీ పోలీసులు, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠను పురస్కరించుకుని అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో వేడుకలు జరిగాయి. ఇక్కడ భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా రామాలయంలా తలపిస్తోంది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, లండన్, ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాల్లోని భారతీయులు రాములోరి ప్రాణప్రతిష్ట వేడుకలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout