స్ట్రింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కైన సినీ తారలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల తరుణంలో నల్లధనం ఎక్కువగా చేతులు మారుతుంటుంది. ఇలాంటి వాటిపై పోలీసులు, అవినీతి నిరోధక శాఖతో పాటు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌లు కూడా ఓ కన్నేసి ఉంచుతారు. పలు స్ట్రింగ్ ఆపరేషన్లు జరుగుతుంటాయి.
అలాంటి ఓ స్ట్రింగ్ ఆపరేషన్‌లో 36 మంది బాలీవుడ్ తారలు వివేక్ ఒబెరాయ్, సోనూసూద్, జాకీష్రాఫ్, కైలాష్ ఖేర్, సన్నీలియోన్, శక్తికపూర్, శ్రేయస్ తల్పడే, అమీషా పటేల్, పంకజ్ ధీర్, నికితన్ ధీర్, పునీత్ ఇస్సార్, టిస్కా చోప్రా, రాఖీ సావంత్, రాజ్‌పాల్ యాదవ్ మిన్నిసా లాంబ, మహిమా చౌదరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కోయినా మిత్ర, దలేర్ మెహందీ, మికా, రాహుల్ భట్, రాజు శ్రీవాస్తవ, విజయ్ ఈశ్వర్‌లాల్ తదితరులు కెమెరా కంటికి చిక్కారు.
కోబ్రా పోస్ట్ విలేఖరులు నకిలీ పేర్లతో పలువురు సినీ, టీవీ నటులు, గాయకులు, డ్యాన్సర్స్ ను వారి మేనేజర్స్ ద్వారా కలిశారు. వస్తున్న లోక్‌సభ ఎన్నికల కోసం తాము సూచించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయమని కోరారు. సదరు సందేశాలను కూడా తామే అందిస్తామని వారి వారి సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పెడితే సరిపోతుందని సూచించారు.
దానికి డమ్మీ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడానికి కూడా వారు సిద్ధమయ్యారని కోబ్రాపోస్ట్ పోర్టల్ సంపాదకుడు అనిరుద్ధ బహల్ చెప్పారు. ఒక్కొక్క సందేశానికి 2 లక్షల నుండి 50 లక్షల వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రుసుముల్లో ఎక్కువగా భాగం నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పినా ఎవరూ కాదనలేదట. అయితే విద్యాబాలన్, అర్షద్ వార్సి, రజా మురాద్, సౌమ్య టాండన్ వంటి వారు ఈ ఒప్పందం సమ్మతం కాదని సూటిగా చెప్పేశారు.
ఈ వీడియోల్లో కొన్ని మాటలను ఉపయోగించుకుని తమను చెడుగా చూపించే ప్రయత్నం చేశారని నటుడు సోనూసూద్ ఆరోపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments