‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి ఉసురు తీసిన టిక్‌టాక్...
Send us your feedback to audioarticles@vaarta.com
‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. టిక్‌టాక్ ఆమె జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండవ ఫ్లోర్‌లో బాత్‌రూమ్‌లో శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగులగొట్టుకుని లోపలికి వెళ్లేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది. వెంటనే శ్రావణిని కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చారు.
అసలు విషయం ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తనకు తల్లిదండ్రులు లేరంటూ శ్రావణితో స్నేహం పెంచుకున్న దేవరాజ్ గత కొంతకాలంగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు.
దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రావణి గత ఎనిమిది సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో రాణిస్తోంది. ‘మనసు మమత’ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన శ్రావణి.. ప్రస్తుతం ‘మౌనరాగం’ సీరియల్‌లో కూడా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com