గాంధీలో కొడుకు అదృశ్యం.. 20 రోజుల తర్వాత తల్లికి షాకింగ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా పాజిటివ్‌తో గాంధీ హాస్పిటల్‌కి చేరిన కొడుకు కొద్ది రోజులపాటు ఫోన్లో తల్లికి టచ్‌లోనే ఉన్నాడు. ఒకరోజు సడెన్‌గా కాల్ రాలేదు. తల్లి తిరిగి చేసినా స్పందన లేదు. దీంతో తల్లి, సోదరుడు కంగారు పడింది. మరుసటి రోజైనా కాల్ వస్తుందిలే అని భావించింది. కానీ తర్వాత కూడా కాల్ లేదు. అనుమానించిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దాదాపు 20 రోజుల తరువాత కొడుకు ఆచూకీ కనిపెట్టారు. కొడుకును ఆ స్థితిలో చూసిన తల్లి షాక్‌కు గురైంది.
హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు చెందిన నరేందర్‌సింగ్ (35) అనారోగ్యంతో గత నెల 30న కింగ్‌కోఠి హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యులు నరేందర్‌కు కరోనా పాజిటివ్‌గా గుర్తించి గాంధీకి తరలించారు. తర్వాతి రోజు నరేందర్ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. సడెన్‌గా కొడుకు నుంచి కాల్ ఆగిపోయింది. దీంతో ఈనెల 6న నరేందర్ తల్లి, సోదరుడు మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఎంతకీ కేసు ఎటూ తేలకపోయే సరికి నరేందర్ సోదరుడు ముఖేష్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు.
తన సోదరుడు గాంధీలో మిస్సయ్యాడని.. ఆచూకీ చెప్పకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానన్నాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు గాంధీ హాస్పిటల్లో గాలించారు. నరేందర్ ఆచూకీ లభించకపోవడంతో చివరిగా మార్చురీని పరిశీలించారు. అక్కడ నరేందర్ మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని చూపించగా వారు నరేందర్దేనని నిర్ధారించారు. దీనిపై మంగళహాట్ సీఐ మాట్లాడుతూ.. మార్చరీకి మే31వ తేదీన రాత్రి 10 గంటలకు గాంధీలో పనిచేసే అటెండర్.. నరేంద్ర సింగ్ డెడ్ బాడీ తీసుకొచ్చినట్టు రికార్డులో ఉందని రణీశ్వర్ వెల్లడించారు.
అసలు నిజంగా నరేందర్ కరోనా బాధితుడేనా? గాంధీ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో నరేందర్ వివరాలేమీ నమోదు చేసుకోలేదా? నిజానికి గుర్తు తెలియని శవాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలిస్తారు కానీ అదేమీ లేకుండా గాంధీలోనే ఉంచటం వెనుక మర్మమేంటి? గాంధీలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా పలుమార్లు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నరేందర్ ఘటన మరోసారి గాంధీ ఆసుపత్రి విమర్శల పాలవుతోంది.
కాగా.. నరేందర్ కరోనా పేషెంట్ కాదని.. అతను గత నెల 30న ఒకసారి ఔట్‌పేషెంట్ వార్డుకు వచ్చి వెళ్లినట్టు రికార్డులో ఉందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. కరోనా వార్డులో నరేందర్‌కు సంబంధించిన వివరాలేమీ లేవన్నారు. దీంతో ఈ డెత్‌ను మెడికో లీగల్ కేసుగా వివరాలు నమోదు చేశామన్నారు. పోలీసులే గుర్తు తెలియని బాడీగా మార్చురీలో చేర్చారని.. తమ స్టాఫ్ నిర్లక్ష్యమేమీలేదని రాజారావు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com