లక్షన్నర హ్యాండ్ బ్యాగ్.. కోపంతో విసిరికొట్టిన అషు రెడ్డి తల్లి!
Send us your feedback to audioarticles@vaarta.com
డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులారిటీ పెంచుకుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో యాక్టివ్ గా ఉంటుంది అషు రెడ్డి. తాజాగా ఆషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
అషు రెడ్డి ఇంట్లో బాగా అల్లరిచేసే పిల్లలా కనిపిస్తోంది. ఎందుకంటారా.. ఈ సంగతి వింటే మీకే అర్థం అవుతుంది. అషు రెడ్డి తన తల్లిని ఆటపట్టించడానికి ప్రయత్నించింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ లో అషు తల్లి కోపం కట్టలు తెంచుకుంది. తన తల్లికి ఓ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి దీనిని లక్షన్నర పెట్టి కొన్నానని చెప్పింది. దీనితో అషు తల్లి ఆశ్చర్యంతో నిజం చెప్పు అని అడిగింది. అవును.. లక్షన్నర పెట్టి కొన్నాను.. బావుంది కదా అని పరాచకాలు ఆడింది.
దీనితో అషు తల్లి ఒక్కసారిగా భగ్గుమంది. ఆ బ్యాగ్ ని విసిరి కొట్టింది. ఇప్పటికే ఉన్నవన్నీ ఏం చేస్తావు తగలెట్టుకుంటావా అని ఆమె అషు పై మండిపడింది. దీనితో అషు రెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పడిపడి నవ్వారు. తన తల్లి కోపం చూసి అషు నవ్వాపుకోలేకపోయింది.
చివరకు అషు ఆ బ్యాగ్ అసలు సంగతి రివీల్ చేసింది. ఇది ఖరీదైన బ్యాగ్ అని అబద్దం చెప్పా. ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అని అషు తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments