‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్: నాకు కాబోయే వాడు షూస్‌తో సమానం..

  • IndiaGlitz, [Sunday,October 25 2020]

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు దసరా సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌ను బట్టి చూస్తే... పెళ్లికూతుర్ని సెలక్ట్ చేసుకోవడం కోసం ఓ యువకుడు చేసే ప్రయత్నమే ఈ సినిమాలా అనిపించింది. ఓ యువకుడు తనకు కావల్సిన యువతిని సెలక్ట్ చేసుకునేందుకు 'మీ వైవాహిక జీవితం నుండి మీరేం ఆశిస్తున్నారు' అని ఓ అబ్బాయి తనకు కాబోయే అమ్మాయిని ప్రశ్నిస్తాడు. దీనికి పలువురు యువతుల నుంచి వచ్చే సమాధానం..

కేరింగ్ హస్బెండ్‌.. అన్నీ పనులు షేర్‌ చేసుకోవాలి... నాకు జాయింట్‌ ఫ్యామలీ అంటే చిరాకు... లవ్‌ లవ్‌ లవ్‌ లవ్‌ లవ్‌.. నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం.. ఇంత క్రేజీ సమాధానాలు చెప్పే అమ్మాయిల్లో హీరో మాత్రం షూస్‌తో సమానమని చెప్పే యువతిని ఎంచుకుంటాడు. ఇక ఆ అమ్మాయితో హీరో పడే కష్టాలు.. ఆ అమ్మాయిని దారికి తెచ్చుకోవడం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' రూపొందుతుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కు పూర్వమే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. తాజాగా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా త్వరలోనే కంప్లీట్ చేసుకుని.. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని సంక్రాంతి బరిలో నిలవనుంది.

More News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి...

వీకెండ్‌ షోకి హోస్ట్ నాగార్జున డుమ్మా. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలా వీకెండ్‌ హోస్ట్ లేకుండా నడవడం ఇదే తొలిసారి అయ్యుండొచ్చు.

కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన చిత్రం 'సమాజం' ప్రారంభం!

కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తోన్న మూడో సినిమా సమాజం. ఈ బ్యానర్ లో తీరం , క్రియేటివ్ క్రిమినల్ సినిమాలు తెరకెక్కాయి.

'చావు క‌బురు చ‌ల్ల‌గా' నుంచి మ‌ల్లిక గా లావణ్య త్రిపాఠి

డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక గా చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రం తో క‌నిపించ‌నుంది.

ఆకట్టుకుంటోన్న 'మిస్‌ ఇండియా' ట్రైలర్‌.... నవంబర్‌ 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌.