'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల

  • IndiaGlitz, [Monday,March 02 2020]

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్ నుంచి మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. గీత గొవిందం లాంటి బ్లాక్‌బస్ట‌ర్ చిత్రం లో ఇంకేం... ఇంకేం.... ఇంకేం...కావాలి.... అనే సెన్సేష‌న‌ల్ సాంగ్ ని అందించిన మ్యూజిక‌ల్ కాంబోని మళ్ళీ ఈ చిత్రం ద్వారా రిపీట్ చేశారు. మ‌న‌సా.... మ‌నసా... మ‌న‌సారా... బ్ర‌తిమాలా... త‌న‌వ‌క‌వడిలో ప‌డ‌బొకే మ‌న‌సా అంటూ సాగే ఈ సాంగ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ గా ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు.... ఇండ‌స్ట్రీకి వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ చిత్రాన్ని మెస్ట్ ఇంటిలిజెంట్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు, వాసువ‌ర్మ తో క‌లిసి నిర్మిస్తున్నారు.

మ‌న‌సా మ‌న‌సా అంటూ మ‌న‌సులు దోచుకున్న సిడ్ శ్రీరామ్, గొపిసుంద‌ర్

జీఏ 2 బ్యాన‌ర్ నుంచి గ‌తంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియో ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. మ్యూజిక‌ల్ హిట్స్ కొంత గ్యాప్ వ‌చ్చిన స‌మ‌యంలో ఈ చిత్రం మ్యాజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టం విశేషం. మళ్ళి అదే కాంబినేష‌న్ లో వస్తున్న ఈసినిమా ఆడియో కూడా అదే రేంజి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలో వుంది. గోపీసుంద‌ర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బ‌మ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన‌ ఈ పాట మ‌నసు దోచుకుంది. ఈపాట‌ని ఎన్నో మంచి పాట‌ల‌కి సాహిత్యాన్ని అందించిన సురేంద‌ర్ కృష్ణ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు.

లిరిక్స్‌..

ప‌ల్ల‌వి..
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్ర‌తిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకమ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావే మ‌న‌సా
నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా నాతోనే వుంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

చ‌ర‌ణం1..

ఏముంది త‌న‌లోని గ‌మ్మ‌త్తు అంటే
అది దాటి మ‌త్తేదే ఉందంటూ అంటూ
త‌న‌క‌న్నా అందాలు వున్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..తానే నీ మాట వింటుందా ఆశ‌
నేనెవ‌రో తెలుసా నామాట అలుసా..నా తోనే వుంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా.

చ‌ర‌ణం2

తెలివంత నా సొంత‌మంటూ తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటూ మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్క‌లుంద‌టూ ప్ర‌తి చోట వెతికా
త‌న‌తో వుండే ప్ర‌తిఓక్క నిమిషం మ‌ర‌ల మ‌ర‌ల పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా నాతోనే వుంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా

More News

కొరటాలకు షాకిచ్చిన చిరంజీవి!!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి 152వ చిత్ర‌మిది.

'RRR' ఫుల్ ఫామ్ ఇదేనట.. త్వరలో అధికారిక ప్రకటన!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా

చిరు, అలీ ఇద్దరూ కాదు.. అంబానీకి మాటిచ్చేసిన జగన్!

టైటిల్ చూడగానే ఇదేంటబ్బా తలా తోకా లేకుండా ఉంది.. అసలు మెగాస్టార్ చిరంజీవికి.. అలీకి సంబంధమేంటి..? వారిద్దరి మధ్యలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నాకు ఓ సలహా కావాలి.. ఇవ్వండి.. : ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కోడలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సామాజిక విషయాల్లో తన వంతుగా కృషి చేస్తుంటారు. అదే విధంగా ప్రజలకు పలు విషయాల్లో సందర్భాన్ని

ప్రభాస్-నాగీ మూవీలో స్టార్ హీరోయిన్!

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక