మార్చి 2 న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ఫస్ట్ సింగిల్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆడియో ఆల్బమ్ నుంచి మెదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. మార్చి 2న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతలు బన్నివాసు, వాసు వర్మ తెలిపారు. ఇటీవలే అఖిల్, పూజా హెగ్ధేలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం నెంబర్ వన్ పోజిషన్ ట్రెండ్ అవ్వడం విశేషం. ప్రస్తుతం హైదరబాద్ పరిశర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగణంతో పాటు అఖిల్, పూజా హగ్ధేలు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ స్కిల్స్ తో పాటు ఇండస్ట్రీకి వరుసపెట్టి బ్లాక్ బస్టర్స్ ని అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చర్స్ పతాకం పై తెరకెక్కుతుండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల ఎక్స్ పెట్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా నిర్మాతలు బన్నివాసు, వాసు వర్మలు తెలిపారు.
మ్యూజికల్ మ్యాజిక్ రిపీట్
జీఏ 2 బ్యానర్ తో గోపీ సుందర్ ఉన్న జర్నీ గురించి అందరికీ తెలిసిందే. గతంలో జీఏ2 బ్యానర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ సంగీతం ఇచ్చారు. ఈ నేపథ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో మ్యూజికల్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు గోపీ సుందర్. ఈ ఆల్బమ్ నుంచి మెదటి పాటను మార్చి 2న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సిద్ శ్రీరామ్ ఉంటే ఇంకేం కావాలి
జీఏ 2 బ్యానర్ నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గీతగోవిందం ఆడియోకి వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. గోపీసుందర్ కంపోజ్ ఈ ఆల్బమ్ లో సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు చాట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇంకేం ఇంకేం కావాలి పాట అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న మోస్ట్ ఎలిజి బుల్ బ్యాచలర్ కి సంబంధించిన మొదటి సింగిల్ ని సైతం సిద్ శ్రీరామ్ పాడుతుండటం విశేషం. ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి పాట మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ చైర్ కొట్టేస్తున్నాయి. ఇదే తరహాలో మార్చిన 2న విడుదల కాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫస్ట్ సింగిల్ కూడా ఆడియెన్స్ విష్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేయడం ఖాయమనే అనిపిస్తోంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న జీఏ2
పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూ పండగే వంటి టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్స్ అందించిన యంగ్ ఇంటిల్జెంట్ ప్రొడ్యూసర్ బన్ని వాసు మరోసారి అదే ఉత్సాహాంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్వకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అలానే ఈ చిత్రాన్ని లెజండరీ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో నిర్మాత వాసు వర్మతో కలిసి బన్ని వాసు సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments