2020లో అయినా ఈ హీరోలు పెళ్లి పీటలెక్కుతారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో చాలా మందే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలతో.. వారి వారి వ్యాపారాలతో బిజబిజీగా ఉండటంతో పెళ్లి అనే మాట ఎత్తుకోకుండా వారి పనుల్లో నిమగ్నమైపోయారు. టాలీవుడ్లో కొందరు 30 పూర్తవ్వకముందే పెళ్లి పీటలెక్కగా.. థర్టీ దాటి ఫార్టీ దగ్గరికొచ్చినా మరికొందరు మాత్రం పెళ్లి అనే ఊసే లేకుండా జీవితమనే బండిని లాగించేస్తూ ఒంటిరిగానే గడిపేస్తున్నారు. అసలు ఎంత మంది బ్యాచిలర్ జీవితాలు గడుపుతున్నారు..? 30కి పైబడిన వారెంత మంది..? 35 ఏళ్లకు పైబడిన వారెంత మంది అనేది ఇప్పుడీ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ వీళ్లే..!
ప్రభాస్ (40)
రానా దగ్గుపాటి (38)
ఆది పినిశెట్టి (37)
నితిన్ (36)
నారా రోహిత్ (35)
తరుణ్ (35)
నిఖిల్ సిద్ధార్థ్ (34)
అడవి శేష్ (34)
సాయి ధరమ్ తేజ్ (33)
సుశాంత్ (33)
సందీప్ కిషన్ (32)
అల్లు శిరీష్ (32)
రామ్ పోతినేని (31)
విజయ్ దేవరకొండ (31)
నాగశౌర్య (30)
వరుణ్ తేజ్ (29)
అఖిల్ అక్కినేని (26)
బెల్లంకొండ శ్రీనివాస్ (27)
కాగా.. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలా దేవీ పెదవి విప్పారు. వీరిలో కొంత ప్రేమలో ఉండగా.. మరికొందరు పెద్దలు చెప్పిన చోటే పెళ్లిళ్లు చేసుకోవాలని భావిస్తున్నారట. పైన చెప్పిన వారిలో కొంతమందైనా 2020కు పెళ్లి పీటలెక్కి సినీ ప్రముఖులకు, వీరాభిమానులకు పప్పన్నం పెడతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com