3 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసిన ‘మోసగాళ్లు’ ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోసగాళ్లు మూవీ ట్రైలర్‌ను ఈనెల 25న మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ కాజల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించిన ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దక్షిణాదిన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంతో పాటు దేశవ్యాప్తంగా హిందీ భాషలోనూ ‘మోసగాళ్లు’ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో మంచు విష్ణుకి సోదరి పాత్రలో కాజల్ కనిపించనుండటం విశేషం. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి తొలిసారిగా ఓ డైరెక్ట్ సౌతిండియన్ మూవీకి సైన్ చేసిన సినిమా ఇది. కాగా.. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు మూడు మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసి మరీ దూసుకుపోతోంది. ధనవంతులు కావడం కోసం స్నేహితులతో కలిసి కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ చేయడం.. పోలీసులు ఎలాగైనా దోషులను పట్టుకోవాలని యత్నించడం.. ఎట్టి పరిస్థితుల్లో దొరక్కుండా ఉండేందుకు మంచు విష్ణు టీం ప్రయత్నించడం వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ ట్రైలర్ రూపొందింది.
టెక్నాలజీని, మేధస్సును అడ్డం పెట్టుకుని సాగించిన ఒక భారీ ఐటి కుంభకోణం ఆధారంగా కథాంశాన్ని అల్లుకున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం 'మోసగాళ్లు'. 'ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ' వంటి చిత్రాల సరసన నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించింది కాబట్టి సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments