దేశంలో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా 83 వేలకు పైగా కేసులు
- IndiaGlitz, [Friday,September 04 2020]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో గత రెండు రోజులుగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా 83,341 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది.
కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1096 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 68,472కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,31,124 మందికి చికిత్స కొనసాగుతోంది. కాగా.. నిన్న ఒక్కరోజే 66,659 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తంగా 30,37,151 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 77.15 శాతం ఉండగా.. మరణాల రేటు 1.74 శాతంగా ఉంది.