మెరుపు దాడులు : భారత మాత తల దించనివ్వను
Send us your feedback to audioarticles@vaarta.com
ఉగ్రమూకలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడిచేసి మంగళవారం తెల్లవారు జామున కేవలం 22 నిమిషాల్లో మూడు స్థావరాలను ధ్వంసం చేసి మొత్తం 300కిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై ఇప్పటికే విదేశాంగ ప్రధాన కార్యదర్శి గోఖలే స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సంద్భంగా భారత్ మాతాకీ జై అనే నినాదాలతో సభ మార్మోగింది. ప్రధాని వేదికపై పుల్వామా అమరవీరుల ఫొటోలు ఉన్నాయి.
మోదీ మాటల్లోనే...
" మెరుపు దాడులు చేసిన వీరులకు తలవంచి నమస్కారం చేద్దాం. దేశం మేల్కొంటోంది.. ప్రతీ భారతీయుడు గెలుస్తాడు. మాతృభూమిపై ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని ఎవరి ముందూ తలదించనివ్వను.. భారత మాత తల దించనివ్వను. దేశానికి మించి మరొకటి లేదు. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. భారతావని ఎప్పుడూ తలఎత్తుకునే ఉంటుంది. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తు్న్నాను. దేశం ఎప్పుడూ సురక్షితంగానే ఉంది. దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు. సైనిక సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భారత్ విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఓఆర్ఓపీ కింద మాజీ సైనికులకు రూ. 35వేల కోట్లు అందించాం" అని మోదీ ప్రసంగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments