మెరుపు దాడులు : భారత మాత తల దించనివ్వను

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

ఉగ్రమూకలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడిచేసి మంగళవారం తెల్లవారు జామున కేవలం 22 నిమిషాల్లో మూడు స్థావరాలను ధ్వంసం చేసి మొత్తం 300కిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై ఇప్పటికే విదేశాంగ ప్రధాన కార్యదర్శి గోఖలే స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సంద్భంగా భారత్ మాతాకీ జై అనే నినాదాలతో సభ మార్మోగింది. ప్రధాని వేదికపై పుల్వామా అమరవీరుల ఫొటోలు ఉన్నాయి.

మోదీ మాటల్లోనే...

మెరుపు దాడులు చేసిన వీరులకు తలవంచి నమస్కారం చేద్దాం. దేశం మేల్కొంటోంది.. ప్రతీ భారతీయుడు గెలుస్తాడు. మాతృభూమిపై ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని ఎవరి ముందూ తలదించనివ్వను.. భారత మాత తల దించనివ్వను. దేశానికి మించి మరొకటి లేదు. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. భారతావని ఎప్పుడూ తలఎత్తుకునే ఉంటుంది. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తు్న్నాను. దేశం ఎప్పుడూ సురక్షితంగానే ఉంది. దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు. సైనిక సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భారత్ విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఓఆర్ఓపీ కింద మాజీ సైనికులకు రూ. 35వేల కోట్లు అందించాం అని మోదీ ప్రసంగించారు.

More News

సర్జికల్ స్ట్రైక్స్‌‌కు స్కెచ్ వేసింది ఈయనే...

ఉగ్రమూకలపై భారతసైన్యం 2016, 2019లో ఇలా రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అయితే ఈ స్ట్రైక్స్‌‌కు సంబంధించి స్కెచ్ వేసిందెవరు..?

డేర్‌‌ అండ్ డ్యాషింగ్‌‌ మోడీ.. సర్జికల్స్‌‌ స్ట్రైక్స్‌‌తో సత్తా చాటాడు!

సినిమాల్లో హీరో ఏ రేంజ్‌‌లో డేర్ చేసి ఫైట్స్ చేస్తాడో అందరం చూసే ఉంటాము.. అయితే రియల్‌‌‌ లైఫ్‌‌లో అవన్నీ జరగవ్.. అలా చేయాలన్నా ఆలోచనలు కూడా రావ్.

ఎస్.. ఉగ్రమూకలపై సర్జికల్‌ స్ట్రైక్స్ నిజమే

పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రమూకలను మట్టుబెట్టాలని ఇండియన్ ఆర్మీ పక్కా వ్యూహం ప్రకారమే మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలపై దాడులు

'కార్గిల్ గ‌ర్ల్' అంటున్న జాన్వి

గ‌త ఏడాది `ద‌ఢ‌క్‌` చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ .. న‌టిగా మంచి మార్కుల‌ను సంపాదించుకుంది.

అనుకున్న టైంకే 'మ‌హ‌ర్షి'

సూప‌ర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో