'రాజా ది గ్రేట్' చిత్రానికి మరింత వినోదం జత కానుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
అరె బుజ్జి..ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటి?
ఆనందం..అమితానందంతో పగలబడి నవ్వుతున్నారు..
హు హు హు హూ..హు హు హు హూ..
నిజమే..'రాజా ది గ్రేట్' సినిమా చూసిన ప్రేక్షకులు కామెడీ బాగాఎంజాయ్ చేస్తున్నారని అందరూ అంటున్నారు.
మాస్ మహారాజా రవితేజ, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'రాజా ది గ్రేట్'. దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. పటాస్, సుప్రీమ్ వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో సక్సెస్‌ను అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. భద్ర తర్వాత రవితేజ, దిల్‌రాజు కలయికలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ధీటుగా రాజా ది గ్రేట్ సూపర్బ్ కలెక్షన్స్‌తో సత్తా చాటింది.
టాలీవుడ్‌లో ..ఓ కమర్షియల్ హీరో పూర్తిస్థాయి అంధుడి పాత్రలో నటించడం తేలికైన విషయం కాదు. కానీ రవితేజ కథ, అందులో పాత్రకు ప్రాధాన్యమివ్వడమే కాక, దర్శక నిర్మాతలపై నమ్మకంతో ఈ సినిమాలో నటించారు. రవితేజ పాత్రలో ఒదిగిపోయి, నటించిన తీరు అద్భుతమని..రవితేజ ది గ్రేట్ అని ప్రేక్షకులు అంటున్నారు.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందించిన ప్రక్షకులకు ఇంకా వినోదాన్ని అందించడానికి నిర్మాత దిల్‌రాజు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎడిటింగ్‌లో తీసేసిన కామెడీ సీన్స్‌ను ఇప్పుడు సినిమాలో యాడ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫన్ రైడ్‌గా ఉన్న ఈ సినిమా ఈ సీన్స్ యాడింగ్ వల్ల మరింత వినోదాన్ని ప్రేక్షకులకు పంచనుందనటంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments