యుద్ధాల కంటే ప్రమాదకరం.. 22న ఎవరూ బయటికి రావొద్దు!

  • IndiaGlitz, [Friday,March 20 2020]

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. జాతిని ఉద్దేచించి గురువారం నాడు మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా వచ్చే ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్వ్యూ ఉంటుందని.. మార్చ్ 22 ఆదివారం ఉదయం 7గం నుండి రాత్రి 9గం వరకూ ఎవరు కుడా బయటకి రాకూడదని తెలిపారు. మీకు కావాలిసిన వస్తువులు మేమే మీ ఇంటికి వచ్చి ఇస్తామని తెలిపారు. కరోనా వైరస్ మొదటి ప్రపంచం యుద్ధమును గుర్తు తెస్తుంది.. అంతకంటే ఇది ప్రమాదమని హెచ్చరించారు. కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా ఏయ్యకూడదన్నారు. దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

నిర్లక్ష్యం చేయకండి!

‘నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావాలి. కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం. ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలి. అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదు. సమూహాలకు దూరంగా ఉండాలి. ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు’ అని దేశ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.

More News

దేశ చరిత్రలో ఫస్ట్ టైం..: ఎట్టకేలకు నిర్భయ నిందితులకు ఉరి

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున

శ్రీవారి భక్తులారా సహకరించండి : టీటీడీ ఈవో

‘కరోనా’ మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం విలేకరుల సమావేశంలో

జెన్నిఫర్.. మీ త్యాగానికి ప్రపంచం హ్యాట్సాఫ్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. ఆ పేరెత్తితేనే వణికిపోతున్న క్రమంలో..  మందులు లేకుండా శవాలు గుట్టల్లా తేలుతున్న సందర్భంలో.. నాపైన టెస్ట్‌లు చేసి మందు కనిపెట్టండి..

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధం: ఎవరూ బయటికి రావొద్దు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి గంటగంటకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు

విల‌నిజాన్ని చూపించబోతున్న భూమిక

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఖుషీలో న‌టించిన భూమిక చావ్లా హీరోయిన్‌గా స్టార్ హీరోల‌తో న‌టించింది. అదే స‌మ‌యంలో నిర్మాత‌గా మారింది.