యుద్ధాల కంటే ప్రమాదకరం.. 22న ఎవరూ బయటికి రావొద్దు!
- IndiaGlitz, [Friday,March 20 2020]
మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. జాతిని ఉద్దేచించి గురువారం నాడు మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా వచ్చే ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్వ్యూ ఉంటుందని.. మార్చ్ 22 ఆదివారం ఉదయం 7గం నుండి రాత్రి 9గం వరకూ ఎవరు కుడా బయటకి రాకూడదని తెలిపారు. మీకు కావాలిసిన వస్తువులు మేమే మీ ఇంటికి వచ్చి ఇస్తామని తెలిపారు. కరోనా వైరస్ మొదటి ప్రపంచం యుద్ధమును గుర్తు తెస్తుంది.. అంతకంటే ఇది ప్రమాదమని హెచ్చరించారు. కరోనా వైరస్ను తక్కువగా అంచనా ఏయ్యకూడదన్నారు. దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు.
నిర్లక్ష్యం చేయకండి!
‘నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావాలి. కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం. ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలి. అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదు. సమూహాలకు దూరంగా ఉండాలి. ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు’ అని దేశ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.