తెలుగులో కంటే తమిళంలోనే క్రేజ్
- IndiaGlitz, [Sunday,October 11 2015]
'ఊపిరి'.. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ఈ సినిమా తమిళంలోనూ 'తోళా' పేరుతో రూపొందుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ డిసెంబర్లో కానీ.. వచ్చే ఏడాది ఆరంభంలో కానీ.. రెండు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ క్రేజ్‌ని సంపాదించుకుంటుందని ఇన్సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది.
దానికీ ఓ రీజన్ ఉందట. అదేమిటంటే.. ఇందులో జంటగా నటిస్తున్న కార్తీ, తమన్నాలది తమిళంలో ఇప్పటికే రెండు విజయాలను చవిచూసిన జోడీ కావడం. 'పయ్యా ' (తెలుగులో ఆవారా), 'సిరుత్తై' (తెలుగు విక్రమార్కుడుకి రీమేక్)తో తమిళనాట ఈ పెయిర్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో 'తోళా' గా అక్కడి వారి ముందుకెళ్లనున్న 'ఊపిరి'కి అక్కడే ఎక్కువ క్రేజ్ ఉందన్నది వారి మాట.