సెప్టెంబర్ లో విడుదల కానున్న 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

యుక్త వ‌య‌సులోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ అమ్మాయి క‌నిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంట‌ప‌డి పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్న‌ట్టు కాదు. ఆమె కాద‌న్నంత మాత్రాన జీవితాల‌నూ త్యాగం చేసేయాల్సిన అవ‌స‌రం లేదు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లాలంటే ప్ర‌తి ద‌శ‌నూ ఆస్వాదించాలి. గెలుపు, ఓట‌ముల‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాలి'అని అన్నారు వ‌బ్బిన వెంక‌ట‌రావు.

స్మైల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న సినిమా 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్ స‌మ‌ర్పిస్తున్నారు. 40 సినిమాల‌కు పైగా సంభాష‌ణ‌ల ర‌చ‌యితగా ప‌నిచేసిన‌ రామ‌స్వామి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. 'అర్ధ‌నారి' ఫేమ్ అర్జున్ య‌జ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని, రామ‌స్వామి, సీమా చౌదరి కీల‌క పాత్ర‌ధారులు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు. ఆద్యంతం న‌వ్వులు పువ్వులు పూయించే చిత్ర‌మ‌వుతుంది. అన్ని వ‌ర్గాల వారినీ మెప్పిస్తుంది అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి. ఈ చిత్రంలో కడుపుబ్బా న‌వ్వించే హాస్య ర‌సంతో పాటు, కంట‌త‌డి పెట్టించే క‌రుణ‌ర‌సం కూడా ఉంటుంది. దాదాపు న‌ల‌భై చిత్రాల‌కు పైగా మాట‌ల ర‌చ‌యిత‌గా పని చేసిన రామ‌స్వామి దర్శకునిగా చాలా చ‌క్క‌గా చిత్రాన్నిహ్యాండిల్ చేశారు అని తెలిపారు.

న‌టీన‌టులు

పృథ్వి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ భ‌గ‌వాన్‌, అజ‌య్ ఘోష్‌, బాలాజీ, డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ రామ్ ప్ర‌సాద్‌, రాకెట్ రాఘ‌వ‌, అప్పారావు, రంగ‌స్థ‌లం మ‌హేశ్‌, ఎఫ్ ఎం.బాబాయ్‌, ప్ర‌మోదిని, జ‌య‌ల‌క్ష్మీ, గుమ్మ‌డి జ‌య‌వాణి, చంద్ర‌రావు, ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి కెమెరా: య‌ం.మోహ‌న్‌చంద్‌, సంగీతం: కృష్ణ సాయి, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, ఆర్ట్: కె.వి.ర‌మ‌ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, ఫైట్స్: మార్ష‌ల్ ర‌మ‌ణ‌, నిర్మాత‌: వ‌బ్బిన‌. వెంక‌ట‌రావు, క‌థ‌-మాట‌లు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : రామ‌స్వామి.

More News

చిరు పాత్ర‌లో వ‌రుణ్ తేజ్‌.. అయితే కండీష‌న్ అప్లై...

ఎన్టీఆర్ బయోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ క్రిష్ వీలైనన్ని హంగుల‌ను అద్దుతున్నారు.

కారు యాక్సిడెంట్‌లో విక్ర‌మ్ త‌న‌యుడు

హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ఇప్పుడు హీరోగా 'వ‌ర్మ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఆగ‌స్ట్ 24న విడుద‌ల‌వుతున్న 'ది స్టోలెన్ ప్రిన్సెస్‌'

ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్ష‌న్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయ‌లు.. మంత్రాలు ఇవ‌న్నీ సోషియో ఫాంట‌సీ చిత్రాల్లో కామ‌న్‌గా ఉండే అంశాలే.

'ఆర్ ఎక్స్ 100' త‌మిళ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం 'ఆర్‌.ఎక్స్100'. చిన్న చిత్రంగా విడుద‌లై పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా

'యు ట‌ర్న్‌' ట్రైల‌ర్ డేట్‌

సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్‌ కన్నడ ఫిల్మ్ 'యు టర్న్' సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సామ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.