'మూడు పువ్వులు ఆరు కాయ‌లు' ఆనందింపజేస్తుంది....ఆలోచింపజేస్తుంది !!

  • IndiaGlitz, [Saturday,October 13 2018]

స్మైల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందిన సినిమా 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'. వ‌బ్బిన. వెంక‌ట్రావు నిర్మాత‌. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్ స‌మ‌ర్పించారు. రామ‌స్వామి ద‌ర్శ‌కుడు. అర్థ‌నారి ఫేమ్ అర్జున్ య‌జ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని, రామ‌స్వామి, సీమా చౌద‌రి కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమా స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగింది.

ద‌ర్శ‌కుడు రామ‌స్వామి మాట్లాడుతూ '' నేను ర‌చ‌యిత‌గా దాదాపు 40 సినిమాల‌కు ప‌నిచేశాను. మాట‌లు, కామెడీ ట్రాక్స్ రాశాను. స‌హాయ ర‌చ‌యిత‌గా కూడా చేశాను. తేజ‌, శివ‌నాగేశ్వ‌ర‌రావుగారి ద‌గ్గ‌ర ప‌నిచేశాను. మారుతి బ్యాన‌ర్‌లో 'గ్రీన్ సిగ్న‌ల్‌' అనే సినిమాకు మాట‌లు రాశాను. తొలిసారి 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు' అనే సినిమాను డైర‌క్ట్ చేశాను. మూడు సార్లు ఈ సినిమా ఓపెనింగ్ జ‌రిగి ఆగిపోయింది. ఆరు మంది నిర్మాత‌లు మారిపోయారు. ఫైన‌ల్‌గా మా ఫ్రెండ్ వబ్బిన‌. వెంక‌ట్రావు నిర్మాత‌గా వ‌చ్చారు. డా.మ‌ల్లె శ్రీనివాస‌రావుగారు స‌మ‌ర్ప‌కులుగా వ‌చ్చారు. వాళ్ల సాయంతో ఈ సినిమా చేశాం. ఎన్టీఆర్ సినిమా 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌' గురువారం విడుద‌లైంది.

అంద‌రూ 'దానికి పోటీగా మీ సినిమా వేస్తున్నారా?' అని అడిగారు. దానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్ గారంటే చాలా గౌర‌వం. త్రివిక్ర‌మ్‌గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మ‌ధ్య మా సినిమాను విడుద‌ల చేయ‌డం నా అదృష్టం. ఆ సినిమాకు వ‌చ్చిన ఓవ‌ర్ ఫ్లోతో మా హాల్ నిండినా చాలనుకున్నాం. చాలా మంచి క‌థ‌తో తెర‌కెక్కించిన మా చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి రోజుల్లో క‌చ్చితంగా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మాకు న‌మ్మ‌కం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ మాత్ర‌మే కాదు, అన్ని ఎమోష‌న్స్ ట‌చ్ చేశా. డైలాగుల గురించి మాట్లాడుకునేలా ఉంటాయి. తనికెళ్ల భ‌ర‌ణిగారు, పృథ్విగారు, కృష్ణ‌భ‌గ‌వాన్‌గారు, అజ‌య్‌ఘోష్‌గారు, చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్టులు, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, అప్పారావు, రామ్ ప్ర‌సాద్‌, మ‌హేష్‌.. అంద‌రూ చాలా బాగా చేశారు. ఈ సినిమా ఆనందింప‌జేస్తుంది. ఆలోచింప‌జేస్తుంది. న‌వ్వినా, ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి. ఆ ఎమోష‌న్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా బావుంది.. కాస్త ప్ర‌మోష‌న్స్ పెంచ‌మ‌న్నారు.

థియేట‌ర్లు కూడా పెంచ‌మ‌ని అంటున్నారు. కానీ మా వెనుక పెద్ద‌ సంస్థ‌లు లేవు, పెద్ద నిర్మాత‌లు లేరు. మా సినిమాలో అర్జున్ య‌జ‌త్ హీరో, సౌమ్య వేణుగోపాల్‌, పావ‌ని, భ‌ర‌త్ బండారు కీల‌క పాత్ర‌ల్లో చేశారు. న‌టీన‌టుల‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంది. భ‌ర‌త్ త‌ప్ప‌కుండా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు. కృష్ణ‌సాయిగారు మంచి సంగీతాన్నిచ్చారు. మంచి మెలోడీ సాంగ్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాకు ఆయ‌న పాట‌లు హెల్ప్ అయ్యాయి. భాస్క‌ర‌భ‌ట్ల ఓ పాట‌ను రాశారు. చంద్ర‌బోస్‌గారు చాలా మంచి సిట్చువేష‌న్‌కు అటు మ‌ర‌ణం.. ఇటు ప్ర‌ణ‌యం అని ఓ పాట రాశారు. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ మెచ్చుకుంటారు. నా ద‌గ్గ‌ర 30 క‌థ‌లున్నాయి. ఈ సినిమాను ఆద‌రిస్తే త‌ప్ప‌కుండా మంచి సినిమాలు చేస్తాను. సినిమా ప‌రిశ్ర‌మ లో చాలా మంది చిన్న ఆర్టిస్టుల‌, టెక్నీషియ‌న్ల జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా బావుంటుంది. నేను డ‌బ్బులు దాచుకోలేదు. మంచి స‌న్నివేశాల‌ను, మంచి మాట‌ల‌ను, మంచి స్క్రిప్ట్ ల‌ను మాత్ర‌మే దాచుకున్నాను '' అని అన్నారు.

భ‌ర‌త్ బండారు మాట్లాడుతూ '' ఒక పువ్వుకు ఒక కాయే కాస్తుంది. కానీ మూడు పువ్వులు ఆరు కాయ‌లు అనేస‌రికి అన్నీ మల్టిపుల్ అవుతున్నాయ‌ని అర్థ‌మైంది. మా సినిమా క‌లెక్ష‌న్లు కూడా అలాగే మ‌ల్టిపుల్ కావాలి. షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ల‌కు ఆశాజ‌న‌కంగా మా ద‌ర్శ‌కుడిలాంటి వాళ్లు ఉంటారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ సినిమాలో నా తండ్రి పాత్ర‌లో త‌నికెళ్ల‌భ‌ర‌ణిగారు న‌టించారు. అంత గొప్ప న‌టుడు నాతో క‌లిసి న‌టిస్తుంటే చాలా గ‌ర్వంగా అనిపించింది. కొన్ని షాట్స్ రిహార్స‌ల్స్ చేద్దామ‌ని ఆయ‌న చెప్ప‌డం మ‌ర్చిపోలేను. ఆయ‌న ద‌గ్గ‌ర, అజ‌య్ ఘోష్‌గారి ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నా. అజ‌య్ ఘోష్‌గారి వాయిస్ చాలా బావుంటుంది. జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, అప్పారావుగారు, కృష్ణ‌భ‌గ‌వాన్‌గారు, ఎఫ్ ఎం బాబాయ్ అంద‌రూ ఈ సినిమాలో ఉన్నారు. అంద‌రినీ న‌వ్విస్తారు. వాళ్ల ట్రాక్స్ చాలా బావున్నాయి. పృథ్విగారి కంప్లీట్ ట్రాక్ చెప్పుల గురించే ఉంటుంది. అమ్మాయిల చేతిలో మోస‌పోయే పాత్ర‌చేశాను. అర్జున్ పాత్ర చాలా అందంగా ఉంటుంది. త‌న పాత్ర‌కి బాగా క‌నెక్ట్ అయ్యాను. త‌న పాత్ర‌కి సినిమాలో కెరీర్ ఓరియంటెడ్ స్ట్ర‌గుల్ ఉంటుంది. మూడు ర‌కాల రిలేష‌న్‌షిప్ ప్రాబ్ల‌మ్స్ ఉంటాయి. రామ‌స్వామిగారు ఓ పాత్ర చేశారు. ఆయ‌న ప‌క్క‌న సీమా చౌద‌రి నాయిక‌గా చేశారు'' అని అన్నారు.

వ‌బ్బిన వెంక‌ట్రావు మాట్లాడుతూ ''ఈ ద‌ర్శ‌కుడు నాకు 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్‌. చాలా బాగా చేశారు. మా టీమ్ అంద‌రూ చాలా బాగా చేశారు. మంచి సినిమా ఇచ్చామ‌ని ఆడియ‌న్స్ చెప్పారు. డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో మాట్లాడాం. థియేట‌ర్లు పెంచుతాం. ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు మాట్లాడుతూ '' స్మైల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఈ రోజు విడుద‌లైంది మూడు పువ్వులు ఆరు కాయ‌లు. సినిమా బావుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ చెబుతున్నారు. సొసైటీకి మంచి సందేశం ఇచ్చే సినిమా. త‌ప్ప‌కుండా ప‌బ్లిసిటీ ప‌రంగానూ పెంచుతాం. అంద‌రూ ఆద‌రించండి. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం రామ‌స్వామిగారు చేశారు. మా సినిమాలో రెండు పాట‌లున్నాయి. రెండూ ఆణిముత్యాలే. చంద్ర‌బాస్‌గారు రాసిన పాట‌ను బాలుగారు పాడారు. ఇంకో పాట‌ను భాస్క‌ర‌భ‌ట్ల‌గారు రాశారు. ర‌మ్య‌బెహ‌ర‌, సాయిచ‌ర‌ణ్ పాడారు. అది కూడా అద్భుతంగా బాగా వ‌చ్చింది. మా సినిమాటోగ్రాఫ‌ర్ క‌ష్టం తెర‌మీద క‌నిపిస్తోంది. మా సినిమాలో హీరో, హీరోయిన్లు.. చాలా చ‌క్క‌గా న‌టించారు. ఇలాంటి సినిమాను ప్రేక్ష‌కులు చూసి ఆద‌రిస్తే, భ‌విష్య‌త్తుల్లో సందేశాన్నిచ్చే సినిమాల‌ను త‌ప్ప‌కుండా తెరకెక్కిస్తాం'' అని అన్నారు.

కృష్ణ‌సాయి మాట్లాడుతూ '' ముందు మూడు, నాలుగు పాట‌లు అనుకున్నాం. కానీ రెండే చేశాం. సినిమా చూసిన వారంద‌రూ చాలా బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. పాట‌ల‌ను కూడా మెచ్చుకుంటున్నారు. ఆద‌రిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు'' అని అన్నారు.

More News

'జెర్సీ' లో క‌న్న‌డ హీరోయిన్‌

నేచుర‌ల్ స్టార్ నాని... గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా పేర్లు ప‌రిశీలన‌లోకి వ‌చ్చాయి.

కొత్త కాన్సెప్ట్‌తో ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్నారు.

జ‌ర్మనీలో మహేశ్‌...

సూప‌ర్‌స్టార్ మహేశ్ త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి నుండి కాస్త గ్యాప్ దొర‌క‌డంతో ఫ్యామిలీతో క‌లిసి జ‌ర్మ‌నీ ట్రిప్‌కి వెళ్లారు.

మీటూపై క‌మ‌ల్ హాస‌న్ ఏమ‌న్నారంటే..

ప్ర‌స్తుతం మ‌హిళా లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా మీ టూ ఉద్య‌మం మొద‌లైన సంగ‌తి తెలిసిందే.. ముఖ్యంగా సినిమా రంగంలోని మ‌హిళ‌లు తాము ఎదుర్కొన ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తెలియ‌చేస్తున్నారు.

మ‌ళ్లీ కెలుకుతున్న వ‌ర్మ‌...

కొన్ని నెల‌లుగా సోష‌ల్ మీడియాలో సైలెంట్‌గా ఉన్న వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు నేడు ఉన్న‌ట్లుండి మెసేజ్ పెట్టడంతో తాను ఏం మార‌లేద‌ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.