ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

ఏపీలో కరోనాకు తొలిసారిగా మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్‌లో కరోనా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ ప్రయోగం నిర్వహించారు. సెలైన్ ద్వారా అర్ధగంట వ్యవధిలో బాధితుడికి కాక్‌టెయిల్ ఇంజక్షన్‌ను వైద్యులు ఇచ్చారు. అరగంటలో కరోనా బాధితుడిని ఆయుష్ వైద్యులు ఇంటికి పంపించేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ యాంటిబాడీ మందు ల్యాబ్‌లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్‌ల సమ్మెళనం. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్‌ని నిరోధించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది.

ఇదీ చదవండి: 2-డీజీ ఔషధం ధర ఫిక్స్..

మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా ఈ ఇంజక్షన్ అడ్డుకుంటుంది. అయితే ఈ ఇంజక్షన్‌ను ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.గత ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదే చికిత్సతో కోలుకున్నారు. మైల్డ్‌, మోడరేట్‌ బాధితుల పాలిట ఈ చికిత్స బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ను కాక్‌టైల్‌గా ఇంజక్ట్‌ చేస్తారు. ఒకటి గురితప్పినా.. మరో రకం యాంటీబాడీలు వైరస్‌ను అడ్డుకుంటాయి. ఈ ఇంజక్షన్‌ రెట్టింపు భద్రతను కల్పిస్తుంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఇంజక్షన్‌ ఒక్కోడోసుకు రూ. 70 వేల వరకు ఖర్చవుతుంది. మైల్డ్‌, మోడరేట్‌ బాధితులకు సింగల్‌ డోస్‌ సరిపోతుంది.

ఇంజక్షన్‌ ఇచ్చిన గంట పాటు రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. కొన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా ఈ చికిత్స బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్స తర్వాత మూడు నెలలకు వ్యాక్సిన్‌ వేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా చికిత్స ద్వారా మరణాలను 70 శాతం వరకు తగ్గించారు. ఇందులో వైరస్‌ తీవ్రత, రోగి ఎంపిక, సమయం చాలా ముఖ్యమైనవి. ఈ ఇంజక్షన్‌ను 65 ఏళ్లు దాటిన వారు, స్థూలకాయులు, నియంత్రణలేని మధుమేహులు, గుండె జబ్బు బాధితులు, కేన్సర్‌ బాధితులు, రోగనిరోధక ఔషధాలు వాడుతున్న వారికి మాత్రమే ఇవ్వాలి. 55 ఏళ్లు నిండిన వారిలో.. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇవ్వొచ్చు.

More News

లెగ్ పీస్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. స్పందించాల్సిందేనన్న అసదుద్దీన్..

మంత్రి కేటీఆర్‌కు రోజుకు ఎన్నో విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా వెళుతుంటాయి. అప్పుడప్పుడు అభిమానులు ఆయనకు పలు సూచనలు కూడా చేస్తుంటారు.

సుక్కు కథ నిఖిల్ ని కూడా మార్చేసిందే!

టాలీవుడ్ లో ట్యాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. చూడడానికి లవర్ బాయ్ లా కనిపిస్తాడు కానీ మనోడు చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉంటుంది.

కౌశల్ భార్యకు ఏమైంది.. ఆందోళన కలిగించేలా పోస్ట్ !

బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు విజేత కౌశల్ మందా. బిగ్ బాస్ ముందు వరకు కౌశల్ ఒక సాధారణ నటుడు, మోడల్ మాత్రమే. కానీ బిగ్ బాస్ షో తర్వాత కౌశల్ ఓ హీరోలా మారిపోయాడు.

బోల్డ్ సీనా.. అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి

బోల్డ్ కంటెంట్, అడల్ట్ కామెడీ ఉండే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చిత్రాల్లో ఇంటిమేట్ రొమాంటిక్ సీన్లు, శృంగార భరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ ప్రేమ కథలు కూడా ఉంటాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

దివంగత నటుడు, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.