గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న 'మోని'
Send us your feedback to audioarticles@vaarta.com
షాలిని, నందికొండ వాగుల్లోనా లాంటి చిత్రాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లక్కీఏకారి,నజియా, హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం "మోని". భారీ యాక్షన్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవా లో మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది.
ఈ సందర్బంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియజేస్తూ .. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. యాక్షన్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతూన్న ఈ చిత్రాన్ని గతంలో నందికొండ వాగుల్లోనా చిత్ర దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. షాలిని, నందికొండ వాగుల్లోనా వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్కీ ఏకారి , బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న నజియా హీరో హీరోయిన్లు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో మొదటి షెడ్యూల్ పూర్తీ కావొచ్చింది. రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లో జరపనున్నాం. ఆ తరువాత మూడో షెడ్యూల్ ని ముంబై లో జరపనున్నాం. ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.
దాంతో పాటు బడ్జెట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నాము. దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ...ఈ చిత్రలో రెండు పాటలు నాలుగు భారీ ఫైట్లు ఉంటాయి ,బాలీవుడ్ హీరోయిన్ నజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ విలన్ నటిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తీ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ లో రెండో చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో ..సుమన్ శెట్టి , దిల్ రమేష్, సన్నీ టావో,వివేక్ క్యాస్టల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు : భాష్య శ్రీ ,సంగీతం నవనీత్ చారి, ఫైట్స్ : అంజి , సమర్పణ : రంజిత్ కోడిప్యాక, దర్శకత్వం : సత్యనారాయణ ఏకరీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com