'మోని' పాటలు విడుదల

  • IndiaGlitz, [Tuesday,October 09 2018]

లక్కీఏకారి, నాజియా హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం మోని. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలు సోమవారం ఫిలిం ఛాంబర్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా పాల్గొన్న నిర్మాత సాయి వెంకట్ సిడి ని విడుదల చేసారు.

అనంతరం అయన మాట్లాడుతూ .. ఆసక్తికర టైటిల్ తో వస్తున్నా మోని సినిమా మంచి విజయం అందుకోవాలి. సత్యనారాయణ ఏకారి దర్శకుడిగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. తాను ఇదివరకు చేసిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ఈ మోని కూడా సూపర్ హిట్ అయి నిర్మాతకు డబ్బులు తేవాలి అన్నారు.

సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ .. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. ముంబై , గోవా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకెక్కించాడు. షాలిని, నందికొండ వాగుల్లోనా వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్కీ ఏకారి , బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న నాజియా హీరో హీరోయిన్లు పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తున్నా ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించామన్నారు.

దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ...ఈ చిత్రలో రెండు పాటలు నాలుగు భారీ ఫైట్లు ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ లో రెండో చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

సంగీత దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ... ఈ చిత్రలో రెండు పాటలు బాగావచ్చాయి. రీరికార్డింగ్ కు మంచి స్కోప్ ఉన్న సినిమా. బాగ్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని అన్నారు.

హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు మాకు, మా టీమ్ కు మంచి క్రేజ్ తేవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇంకా ఈ చిత్రంలో ..సుమన్ శెట్టి , దిల్ రమేష్, సన్నీ టావో,వివేక్ క్యాస్టల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు : భాష్య శ్రీ ,సంగీతం నవనీత్ చారి, ఫైట్స్ : అంజి , సమర్పణ : రంజిత్ కోడిప్యాక, దర్శకత్వం : సత్యనారాయణ ఏకరీ.

More News

మీ టూ వైర‌ముత్తు

త‌నుశ్రీ ద‌త్తా.. నానా ప‌టేక‌ర్ మ‌ధ్య చేల‌రేగిన కాస్టింగ్ కౌచ్  ప్ర‌కంప‌న‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో తను శ్రీ ద‌త్తా మీ టూ ఉద్య‌మాన్ని స్టార్ట్ చేస్తే..

ప్ర‌ధాని పాత్ర‌లో మోహ‌న్‌లాల్‌...

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌రోసారి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇంత‌కు ఆ పాత్ర ఏంటో అనుకుంటున్నారా!

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా పాత్ర ఏంటంటే?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'..' వీర రాఘ‌వ‌' ట్యాగ్ లైన్.

బాల‌య్య అభిమానుల‌కు షాకిచ్చిన వీకిపీడియా

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణకు ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో బాల‌కృష్ణ ఒక‌రు.

సన్నీకి క‌ర్ణాట‌క‌లో ఎదురుగాలి...

పోర్న్ మూవీస్ నుండి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ ఇప్పుడు 'వీర‌మ‌హాదేవి' యుద్ధ నారిగా క‌న‌ప‌డ‌నున్నారు.