శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ.. అనుమానంతో చెక్ చేస్తే, పోలీసుల అదుపులో టీటీడీ ఉద్యోగి
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపు సమయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూనే వున్నారు. తాజాగా ఆలయ పరకామణిలో దొంగతనం జరగడం కలకలం రేపింది. కరెన్సీ లెక్కింపు మండపంలో చోరీ జరిగినట్లు గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు వెంకటేశ్వర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వెంకటేశ్వర ప్రసాద్ గత కొంతకాలంగా టీటీడీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా కరెన్సీ లెక్కింపు మండపంలో స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ విషయంలో తేడాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వెంకటేశ్వర ప్రసాద్ తీరుపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. భద్రతా సిబ్బంది చేత తనిఖీలు చేయించారు. ఈ క్రమంలో అతను రూ.20 వేల నగదుతో దొరికిపోయాడు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మరో ఘటనలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వున్న కనక దుర్గగుడి హుండీ లెక్కింపు ఘటనలోనూ ఇదే రకమైన ఘటన జరిగింది. మహామండపం బాత్‌రూమ్‌లో బంగారాన్ని సిబ్బంది గుర్తించారు. మంగళవారం ఎస్‌పీఎఫ్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడడంతో అధికారులు ఖంగుతిన్నారు. హుండీల లెక్కింపులో పాల్గొన్న సిబ్బందిపై అనుమానంతో ఆలయ అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments