మనం మాట్లాడుకోపోతేనే బెటర్ : మోనాల్‌కు తెగేసి చెప్పిన అభి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవాళ నామినేషన్స్.. గత వారం స్థాయిలో రచ్చ అయితే జరగలేదు. గత వారంతో పోలిస్తే ఈవారం ప్రశాంతంగానే జరిగినట్టు అనిపించింది. సొహైల్ గిన్నెలు కడుతుండగా షో స్టార్ట్ అయింది. తరువాత అభి, మోనాల్‌ల మధ్య కాన్వర్సేషన్. అఖిల్ గురించి డిస్కషన్. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ఎత్తాడని అభి ప్రశ్నించాడు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావా? అని అభి ప్రశ్నించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా చర్చ కాస్త గొడవకు దారి తీసింది. నువ్వొక పాయింట్‌పై స్టిక్ ఆన్ అయి ఉండవని స్పష్టంగా మోనాల్‌కు చెప్పాడు. మనం మాట్లాడుకోకపోతే బెటర్ అనిపిస్తోందని తెగేసి చెప్పాడు. నీలో నేను తప్పుబట్టడం.. నాలో నువ్వు తప్పుబట్టడం కంటే దూరంగా ఉండటమే బెటర్ అని అభి చెప్పాడు. కనీసం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అయినా చెప్పొచ్చా అని మోనాల్ అడిగింది. తరువాత అభి బర్త్ డే సెలబ్రేషన్స్‌ను హౌస్‌మేట్స్ నిర్వహించారు. అంతా ఉన్నారు కానీ అఖిల్ మాత్రం పడుకుని నిద్ర పోవడాన్ని కెమెరాలు బాగా ఫోకస్ చేశాయి.
నెక్ట్స్ డే మిర్చి టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. క్రితం రోజు రాత్రి మోనాల్‌కి ఆరోగ్యం బాగోకుంటే సెలైన్ ఎక్కించారని బిగ్‌బాస్ చెప్పారు. కప్పుల గురించి రచ్చ. అరియానాకు సొహైల్‌కి మళ్లీ గొడవ. అరియానా నీకంత పొగరేంటంటూ సొహైల్‌పై రెచ్చిపోయింది. అయితే నిన్న నాగ్.. ఆడపిల్లలపై ఎవరూ అరవొద్దని విషయం బాగా మైండ్‌లో పెట్టుకున్నట్టున్నాడు. తన యాటిట్యూడ్‌కి భిన్నంగా సొహైల్ కూల్‌గానే ఉన్నాడు. అరియానా వదలకుండా రచ్చ కంటిన్యూ చేసి విసుగు తెప్పించింది. మధ్యలో కుమార్ సాయి కల్పించుకున్నాడు. వేలు చూపిస్తూ అడగడంతో సొహైల్ కుమార్ సాయిని వేలు దించమన్నాడు. ఎంత దించాలంటూ చాలా వెటకారంగా అడిగాడు. తరువాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అరియానా ఈ ప్రక్రియను ప్రారంభించింది. మెహబూబ్‌ని అరియానా నామినేట్ చేసింది. తరువాత మోనాల్‌ను నామినేట్ చేసింది. తరువాత వచ్చిన దివి.. నోయెల్‌ను నామినేట్ చేసింది. తరువాత మెహబూబ్‌ని నామినేట్ చేసింది. నోయెల్ వచ్చి దివిని నామినేట్ చేశాడు. తరువాత అభిని నామినేట్ చేశాడు. హారిక.. అరియానాను నామినేట్ చేసింది. తరువాత కుమార్ సాయిని నామినేట్ చేసింది.
అభి వచ్చి మెహబూబ్‌ని నామినేట్ చేశాడు. తరువాత అఖిల్‌ని నామినేట్ చేశాడు. తనను నామినేట్ చేస్తున్న సమయంలో మోనాల్ పేరు తీసుకురావడం కరెక్ట్‌గా అనిపించలేదన్న కారణం చెప్పి నామినేట్ చేశాడు. లాస్య.. మెహబూబ్‌ని నామినేట్ చేసింది. తరువాత దివిని నామినేట్ చేసింది. మెహబూబ్.. దివిని నామినేట్ చేశాడు. ఈ నేపథ్యంలో దివికి, మెహబూబ్‌కి మధ్య చిన్న మాటల యుద్ధం జరిగింది. తరువాత మెహబూబ్.. అరియానాను నామినేట్ చేశాడు. సొహైల్.. అరియానాను నామినేట్ చేశాడు. అరియానా రివర్స్‌లో సొహైల్‌ను మాట్లాడనివ్వకుండా రివర్స్‌లో వచ్చింది. ఇవ్వాళేంటో్ అరియానా కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయినట్టు అనిపించింది. తరువాత కుమార్ సాయిని నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కుమార్ సాయికి సొహైల్‌కి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అమ్మ రాజశేఖర్ వచ్చి లాస్యను నామినేట్ చేశారు. తరువాత అభిని నామినేట్ చేశారు.
అవినాష్ వచ్చి దివిని నామినేట్ చేశాడు. అభిని నామినేట్ చేశాడు. మోనాల్ వచ్చి అరియానాను నామినేట్ చేసింది. తరువాత దివిని నామినేట్ చేసింది. అఖిల్ వచ్చి అభిని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా వరస్ట్‌గా చేశావని చెప్పి నామినేట్ చేశాడు. ఏది ఏమైనా రీజన్ అయితే కరెక్ట్‌గా అనిపించలేదు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఏదో చెప్పినట్టుగా అనిపించింది. తరువాత అరియానాను నామినేట్ చేశాడు. కుమార్ సాయి వచ్చి హారికను నామినేట్ చేశాడు. తరువాత మోనాల్‌ను నామినేట్ చేశాడు. మోనాల్‌ని నామినేట్ చేస్తూ కుమార్ సాయి చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. సొహైల్ కెప్టెన్ కాబట్టి ఒకరిని నామినేట్ చేసే అధికారం సొహైల్‌కి ఇచ్చారు. దీంతో మెహబూబ్‌ని సొహైల్ సేఫ్ చేశాడు. ఈ వారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయెల్, లాస్య, హారిక నామినేట్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com