మోనాల్ ఎలిమినేట్.. అఖిల్ ఏదో చెబుతాడట..

  • IndiaGlitz, [Monday,December 14 2020]

‘దడ పుట్టిస్తా నీకు.. దడ పుట్టిస్తా..’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ ఫైనలిస్టులు ముగ్గురు ఎవరో తెలియబోతోంది. ఇప్పటికే తెలిసిపోయింది. అయినా చిన్న యాంక్సైటీ. కంటెస్టెంట్‌లకు విన్నర్ అయితే ఎంత మనీ రాబోతోందనే విషయాన్ని నాగ్ చెప్పారు. సండే ఫన్ డేలో భాగంగా.. రూ.50 లక్షల చెక్స్ ఎవరిది వాళ్లకు ఇచ్చేశారు. ట్రోఫీ గెలిశాక ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారో చెప్పాలని నాగ్ అడిగారు. మొదట హారిక.. అదే నంబర్ వల్ల ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పింది. ఈ మనీ మొత్తాన్ని తన తల్లికి ఇస్తానని.. ఆమెకు ఒక ఇల్లు కొనిస్తానని హారిక చెప్పింది. అరియానా.. ఒక ఇల్లు కట్టుకుంటానని చెప్పింది. అభి.. తను ఆ అమౌంట్‌ను గెలిస్తే తన తండ్రికి ఇస్తానని చెప్పాడు. మోనాల్.. ఆ డబ్బును తన తల్లికి ఇచ్చేస్తానని చెప్పింది. తన పెళ్లైన తర్వాత తన తల్లి తమపై ఆధారపడకూడదని చెప్పింది. అఖిల్.. ఓల్డ్ ఏజ్ హోమ్‌కి కొంత మనీ ఇస్తానని.. వీలైతే ఇల్లు.. లేదంటే కేఫీ ఓపెన్ చేస్తానని చెప్పాడు. సొహైల్.. తనకు ఆ అమౌంట్ చాలా ఎక్కువని.. తన ఫ్రెండ్ వైఫ్ డెలివరీ సమయంలో డబ్బు కోసం పడిన కష్టం చూశానని కాబట్టి రూ.10 లక్షలను అవసరమున్న వారి కోసం ఖర్చు చేస్తానని మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.

ఇక విన్నింగ్ స్పీచ్.. ట్విస్ట్ ఏంటంటే తమ విన్నింగ్ స్పీచ్ కాకుండా నాగ్ కంటెస్టెంట్లలో ఒకరి పేరు చెప్తారు. వారు విన్ అయితే ఎలా బిహేవ్ చేస్తారో చెప్పాలి. మొదట హారిక.. మోనాల్ ఎలా చేస్తుందో చేసి చూపిచింది. అయితే అంతలా చేయలేకపోయింది. అరియానా.. అభి విన్నర్ అయితే ఎలా ఫీలవుతాడో చెప్పింది. అభిని కొంత వరకూ బాగానే ఇమిటేట్ చేసింది. నెక్ట్స్ అభి.. అఖిల్ ఎలా చేస్తాడో చేసి చూపించాడు. పర్వాలేదనిపించాడు. ఇక మోనాల్.. సొహైల్ విన్నర్ అయితే ఎలా చేస్తాడో చేసి చూపించింది. మోనాల్ కూడా పర్వాలేదనిపించింది. అఖిల్.. అరియానా విన్నింగ్ స్పీచ్ చేసి చూపించాడు. అఖిల్ మాత్రం అదరగొట్టేశాడు. నెక్ట్స్ సొహల్.. అరియానా ఎలా చేస్తుందో చెప్పాడు. సొహైల్ అయితే అరియానాను దింపేశాడు. నెక్ట్స్ థర్డ్ ఫైనలిస్ట్‌గా అభిని నాగ్ ప్రకటించారు. పోస్టర్‌ని చూసి సినిమా పేరు చెప్పాలి. అబ్బాయిలు, అమ్మాయిలుగా విడగొట్టారు. అబ్బాయిల తరుఫున అఖిల్, అమ్మాయిల తరుఫున మోనాల్ బజర్ ప్రెస్ చేస్తారు. మొదట అఖిల్ బజర్ ప్రెస్ చేశాడు. తరువాత మోనాల్ ప్రెస్ చేసింది. తరువాత కూడా మోనాలే ప్రెస్ చేసింది. ఈ రౌండ్ సరదా సరదాగా సాగి పోయింది.

తరువాత ధమ్ షరాత్ ఆడించారు. ఇది కూడా సరదా సరదాగా సాగిపోయింది. తరువాత ఫోర్త్ ఫైనలిస్ట్‌గా నాగ్ హారికను ప్రకటించారు. స్కందాన్షి టాస్క్. ఒక్కొక్కరు ఒక్కో ఇంటి నమూనాను సెలక్ట్ చేసుకోవాలి. అది ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో చెప్పాలి. హౌస్‌మేట్స్ అంతా తమ డ్రీమ్ హౌస్‌ని సెలక్ట్ చేసుకుని చెప్పారు. అయితే అఖిల్, సొహైల్, మోనాల్ ఒకే ఇంటిని ఎంచుకున్నారు. ఇక మిగిలిన అరియానా, మోనాల్‌లలో ఫైనలిస్ట్ ఎవరో ఎలిమినేట్ ఎవరో తెలియాలి. మోనాల్ ఎలిమినేట్ అయింది. అరియానా ఫైనలిస్ట్ లిస్ట్‌లో చేరిపోయింది. మోనాల్ జర్నీని నాగ్ చూపించారు. అన్ని ఎమోషన్స్‌తో నైస్‌గా కట్ చేశారు. టాప్ ఫైవ్‌లో ఉన్న ఐదుగురు గెలవాలంటే ఏం మార్చుకోవాలో చెప్పాలని నాగ్ అడిగారు. మొదటగా అభి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పింది. అభి కూడా నిన్ను హర్ట్ చేసినందుకు సారీ చెప్పాడు. దానిని నాగ్ వివరించి చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. తరువాత అరియానా గురించి పాజిటివ్‌గా ఉండాలని.. అగ్రెసివ్ వద్దని చెప్పింది. సొహైల్.. గురించి అరియానాకు చెప్పిన విషయాలే చెప్పింది. అఖిల్, సొహైల్ చిన్న చిన్న విషయాలకే చాలా హర్ట్ అవుతున్నారని వారమే ఉందని అలా అవ్వొద్దని చెప్పింది. హారికకు.. ఫైనల్‌లో అఖిల్‌తో కలిసి ఉండాలని చెప్పింది. అఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని నాగ్‌కి కంప్లైంట్ చేసింది. స్మైల్ చేస్తే హీరోలా ఉంటాడని చెప్పింది. ఒక పాట పాడమని అడిగింది. ‘ఉండిపోరాదే..’ సాంగ్‌ను చాలా ఫీల్‌తో పాడాడు. హర్ట్ చేసినందుకు సారీ చెప్పాడు. వన్ వీక్ ఉందని బాగా ఆడాడని.. ఫైనల్‌లో హారికతో కలిసి ఉండాలని చెప్పింది. మోనాల్‌తో బయటకు వచ్చాక మాట్లాడాల్సింది ఉందని.. బయటకు రాగానే కలిసి మాట్లాడతానని అఖిల్ చెప్పాడు.

తరువాత మోనాల్‌ను పంపించేసి ఫైనలిస్టులు ఐదుగురిని లాన్‌లోకి పిలిచారు. వారి కోసం ఓ పార్టీ అరేంజ్ చేవారు. సాంగ్స్ వేసి అందరిలో హుషారు తెప్పించారు. నెక్ట్స్ సండే ఫైనల్స్ అని.. ఆ రోజున కలుస్తానని మ్యూజిక్‌ని కంటిన్యూ చేయాలని బిగ్‌బాస్‌కి నాగ్ చెప్పారు. ఫైనలిస్టుందరికీ బిగ్‌బాస్ కంగ్రాట్స్ చెప్పి.. ఫినాలే కోసం ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తానికి ఇవాళ్టి షో సందడి సందడిగా సాగింది.

More News

‘తలైవి’ షూటింగ్ కంప్లీట్.. కంగన భావోద్వేగ పోస్ట్..

బాలీవుడ్ స్టార్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’.

వెంకటేష్ బర్త్‌డే కానుకగా.. ‘ఎఫ్ 3’ అధికారిక ప్రకటన..

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. నిన్న కొత్తగా..

భారత్‌లో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా బాగానే తగ్గింది.

తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు..

తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.