'మామ్' సెన్సార్ పూర్తి - జూలై 7 విడుదల
Tuesday, June 27, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సెన్సార్ బోర్డ్ ఛీఫ్ పహ్లజ్ నిహ్లాని 'మామ్' చూసి తను పొందిన అనుభూతిని తెలియజేస్తూ.. ఈ చిత్రాన్ని న్యూ ఏజ్ మదర్ ఇండియాగా చెప్పొచ్చు.
ఇందులో శ్రీదేవి అభినయం నర్గీస్‌ను గుర్తు తెచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టాల్సిందేనని సెన్సార్ సభ్యులు అన్నారు. మంచి కథ, కథనాలతో రవి ఉద్యవర్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా రూపొందించారని, శ్రీదేవి నటన ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి, ఎడిటింగ్: మోనిసా బల్ద్వా, కథ: రవి ఉద్యవార్, గిరీష్ కోహ్లి, కోన వెంకట్, స్క్రీన్‌ప్లే: గిరీష్ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్, దర్శకత్వం: రవి ఉద్యవార్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments