close
Choose your channels

బాల‌య్య మూవీలో మోక్ష‌జ్ఞ పాత్ర ఇదే..

Saturday, July 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌతీమీపుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ తెర‌కెక్కిస్తున్న గౌతీమీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం కోసం ప్ర‌స్తుతం క్లైమాక్స్ సీన్స్ ను జార్జియాలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో శాత‌క‌ర్ణిగా బాల‌య్య న‌టిస్తుండ‌గా, ఆయ‌న భార్య‌గా శ్రియ న‌టిస్తుంది. ఇదిలా ఉంటే...ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ చిత్రంలో బాల‌య్య న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

అయితే... ఈ చిత్రంలో శాత‌క‌ర్ణి కుమారుడు పులోమావి పాత్ర ఒక‌టి ఉంద‌ట‌. ఆ పాత్ర‌ను మోక్ష‌జ్ఞ చేస్తే బాగుంటుంద‌ని బాల‌య్య‌, క్రిష్ అనుకుంటున్నార‌ట‌. అఖిల్ కూడా ఫ‌స్ట్ హీరోగా కాకుండా మ‌నం చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ప‌రిచ‌యం అయ్యాడు. బాల‌య్య కూడా త‌న కుమారుడును ఫ‌స్ట్ హీరోగా కాకుండా ఇలా ఓ చిన్న పాత్ర ద్వారా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. ఇదే క‌నుక జ‌రిగితే....గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.