మోక్షజ్ఞ మూవీ షూటింగ్ ఎప్పుడంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ సినీ వారసుడు మోక్షజ్ఞ రీ ఎంట్రీ కోసం అభిమానులెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య ఓ సందర్భంలో తేల్చేశారు. అయితే దర్శకుడు, నిర్మాణ సంస్థ గురించి మాత్రం బాలయ్య ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా హిందూపురం నియోజక వర్గంలో బాలయ్య విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తెలియజేశారు. వచ్చే ఏడాది జూన్ నుండి మోక్షజ్ఞ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు బాలయ్య.
బాలయ్య రీసెంట్ 101వ చిత్రం పైసా వసూల్ విడుదల సందర్భంగా మహిళలకు 101 చీరలన పంచి పెట్టారు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాను చేస్తున్నాడు. 103వ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. అలాగే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా నటించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com