మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఏదో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి మూడో తరం హీరోగా సినిమాల్లోకి రానున్నారు నందమూరి మోక్షజ్ఞ. అయితే అందుకు 2018 వరకు వేచి చూడాల్సిందే. అసలు మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో, ఏ నిర్మాణ సంస్థలో హీరోగా పరిచయం అవుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ..స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ద్వారా వచ్చే ఏడాది తెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడట. తేజ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో మోక్షజ్ఞ, చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో కనపడతారట. పెద్దయ్యాక అదే పాత్రను బాలకృష్ణ పోషిస్తారట. ఈ సినిమాను దర్శకుడు తేజ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణే ఈ సినిమాను నిర్మిస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com