మోక్ష‌జ్ఞ‌... కాఫీ ల‌వ‌ర్‌!

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కోకొల్ల‌లు. బోయ‌పాటి శ్రీను ఈ కుర్రాడిని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తార‌ని అప్ప‌ట్లో చాలా వార్త‌లు వినిపించాయి. అయితే వాటిలో నిజానిజాల గురించీ, మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ గురించి తానే ప్ర‌క‌టిస్తాన‌ని ఇది వ‌ర‌కు చాలా సార్లు నంద‌మూరి బాల‌కృష్ణ అనౌన్స్ చేశారు. ఇటీవ‌ల హిందూపురంలో మ‌రోసారి విజ‌యం సాధించిన ఆయ‌న‌, సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.

మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి మాత్రం ఎలాంటి వివ‌రాలూ ఇప్ప‌టిదాకా అఫిషియ‌ల్‌గా బ‌య‌ట‌కు రాలేదు. ఇదిలా ఉండ‌గా, మోక్ష‌జ్ఞ ఫిల్మ్ న‌గ‌ర్‌లోని ఓ కాఫీ షాప్‌కు రెగ్యుల‌ర్‌గా వెళ్తున్నార‌ట‌. అక్క‌డ ఒక్క‌రే కూర్చుని కాఫీని ఆస్వాదిస్తున్నారట‌. మామూలుగా ఆ వ‌య‌సులో చుట్టూ గ్యాంగ్ ఉండ‌టం ప‌రిపాటి. కానీ మోక్ష్ మాత్రం గ్యాంగ్‌లు మెయింటెయిన్ చేయ‌డం లేదు. ఇంట్లో ఉన్న‌ప్పుడు తండ్రితో స‌ర‌దాగా ఉండే మోక్ష్ స‌మ‌య‌పాల‌ను అత్యంత విలువ ఇస్తార‌ట‌. త‌ల్లిదండ్రుల‌లాగా క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న కుర్రాడని ఆయ‌న గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ఏదేమైనా స‌ర‌దాగా కాఫీ షాప్ విజిట్ చేయ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న కాఫీ ల‌వ‌ర్ అనే విష‌యాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.