సెన్సారు కార్యక్రమాలు పూర్తి, జులై 27 న 'మెహిని' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంలో దశాబ్దకాలం గా టాప్ హీరోయిన్ గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మెహిని గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు భాషల్లో మెహిని గా ఈచిత్రం తెరకక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మిపిక్చర్స్ తెలుగు లో విడుదల చేస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్. శ్రినివాసరావు పల్లెల, కరణం మధులత,గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తి లు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం చేపట్టారు. ఆర్.మాదేష్ దర్శకుడు. హర్రర్ కామెడి బ్యాక్‌డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ చిత్రం లో త్రిష తో పాటు జాఖీ, యోగి బాబు, పూర్ణిమా భాఖ్యారాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా వుంది. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ంర ఆడియో ని విడుదల చేశారు. ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జులై 27న రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ... త్రిష కి తెలుగులో ఇన్న క్రేజ్ అందరికి తెలుసు.. మెహిని చిత్రం తనకి కమ్ బ్యాక్ గా వుంటుంది. హర్రర్ కామెడి యాక్షన్ చిత్రం గా తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కి మాంచి క్రేజ్ రావటం తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. విజువల్ గ్రాండియర్ గా హర్రర్ బ్యూటి తో అందర్ని అలరిస్తుంది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. త్రిష ఫెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేఖంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ తో జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం చూసిని సెన్సారు సభ్యులు నవ్వుతూ వచ్చి నిర్మాతకి, దర్శకుడు కి శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు ఈ చిత్రం చాలా బాగుందని, నవ్వించినంత సేపు నవ్వించి థ్రిల్ చేశారని, ముఖ్యంగా కాన్సెప్ట్ చాలా కొత్తగా వుందని ప్రశంశలు జల్లు కురిపించారు. ముఖ్యంగా త్రిష నటన ఆశ్యర్యపరిచిందని ఆమెని ఇది సూపర్ కమ్‌బ్యాక్ చిత్రంగా నిలుస్తుందని మరీ మరీ చెప్పారు. ఈ టాక్ తో ట్రెడ్ లో క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుంది. అని అన్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com