సస్పెన్స్‌కు తెర... ‘మరక్కర్’ థియేటర్స్‌కే వస్తున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్’ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నట్లు మోహన్ లాల్ స్వయంగా ప్రకటించారు. ‘మరక్కార్ ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ’ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే కరోనా కారణంగా, థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. భారీ బడ్జెట్ మూవీ కావడం వల్ల మరక్కర్‌ను థియేటర్ల ద్వారానే భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కేరళతో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు.
దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ‘మరక్కార్’ సినిమాను డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ చేయాలని భావించారు నిర్మాతలు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో మోహన్ లాల్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. చివరికి కేరళ సినిమాటోగ్రఫీ మంత్రి సాజి చెరియన్ రంగంలోకి దిగి.. సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయిస్తామని చెప్పి అభిమానులను శాంతింపజేశారు. థియేటర్లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు కూడా ఇస్తామని మంత్రి తెలిపారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే .. ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడేలా.. ‘మరక్కర్’ చిత్రాన్ని థియేటర్స్‌లో ఈ ఏడాది డిసెంబరు 2 న విడుదల చేస్తామని శుక్రవారం మోహన్‌లాల్ స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్ చీఫ్ మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ప్రియదర్శన్ దర్శకత్వం ‘మరక్కర్’లో మరక్కర్ తెరకెక్కింది. అర్జున్, సునీల్ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments