సస్పెన్స్‌కు తెర... ‘మరక్కర్‌’ థియేటర్స్‌కే వస్తున్నాడు

  • IndiaGlitz, [Saturday,November 13 2021]

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్‌’ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నట్లు మోహన్ లాల్ స్వయంగా ప్రకటించారు. ‘మరక్కార్ ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ’ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే కరోనా కారణంగా, థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. భారీ బడ్జెట్ మూవీ కావడం వల్ల మరక్కర్‌ను థియేటర్ల ద్వారానే భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కేరళతో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ‘మరక్కార్’ సినిమాను డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ చేయాలని భావించారు నిర్మాతలు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో మోహన్ లాల్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. చివరికి కేరళ సినిమాటోగ్రఫీ మంత్రి సాజి చెరియన్ రంగంలోకి దిగి.. సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయిస్తామని చెప్పి అభిమానులను శాంతింపజేశారు. థియేటర్లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు కూడా ఇస్తామని మంత్రి తెలిపారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే .. ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందనే వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడేలా.. ‘మరక్కర్‌’ చిత్రాన్ని థియేటర్స్‌లో ఈ ఏడాది డిసెంబరు 2 న విడుదల చేస్తామని శుక్రవారం మోహన్‌లాల్‌ స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్‌ చీఫ్‌ మహ్మద్‌ అలీ మరక్కర్‌ అలియాస్‌ కుంజాలి మరక్కర్‌ జీవితం ఆధారంగా ప్రియదర్శన్‌ దర్శకత్వం ‘మరక్కర్‌’లో మరక్కర్ తెరకెక్కింది. అర్జున్, సునీల్‌ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

More News

ప్రమోషన్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు లేవు : ‘‘ పుష్ప ’’ను పోస్ట్ పోన్ చేస్తున్నారా.. అసలేం జరుగుతోంది..?

కోవిడ్ తగ్గుముఖం  పట్టడం, థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో విడుదలకు నోచుకోని చిన్నా, పెద్దా సినిమాలు వరుసపెట్టి క్యూకడుతున్నాయి.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ కుమార్తె.. అది కూడా తెలుగులో..?

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సీనియర్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల పిల్లలు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా జరిగిన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఫంక్షన్

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ 'జీ 5'.

ఎట్టకేలకు వీడిన సస్పెన్స్ .. ఓటీటీలోనే వెంకటేశ్ 'దృశ్యం -2' , ఆకట్టుకుంటోన్న టీజర్

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిగ్‌బాస్ 5 తెలుగు: నేను మనిషినా, పశువునా.. యానీ మాస్టర్ ఆగ్రహం, హౌస్‌మేట్స్‌ ధర్నా

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఫన్నీగా సాగింది. ముఖ్యంగా కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించని బీబీ హోటల్ టాస్క్ ఈ రోజు కూడా సాగింది.