స్నేహితుడి కోసం వంటవాడిగా మారిన మోహన్‌లాల్
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ స్నేహితుడు పృథ్వీరాజ్ కోసం వంటవాడిగా మారారు. అసలు మోహన్‌లాల్ వంటవాడిగా ఎందుకు మారారు? అనే విషయాన్ని చూస్తే ఇటీవల మోహన్‌లాల్ స్నేహితుడు పృథ్వీరాజ్, అతని భార్య సుప్రియా మీనన్‌ను తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అయితే ఈ విందుకు పృథ్వీరాజ్ హాజరు కాలేదు. ఆయన భార్య సుప్రియా మీనన్ మాత్రమే హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. మోహన్‌లాల్ తనే వంటవాడిగా మారారు. ఎంతో రుచికరమైన భోజనాన్ని తయారు చేసి సుప్రియా మీనన్‌కు అందించారు.
భోజనం అనంతరం మోహన్‌లాల్ చెఫ్ డ్రెస్‌లోని ఫొటోను సుప్రియా మీనన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. `చెఫ్‌గా మారిన మోహన్‌లాల్ మాకోసం ఎంతో రుచికరమైన భోజనాన్ని తయారు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ అద్వితీయమైన విందును పృథ్వీరాజ్ కోల్పోయారు`` అని మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను మోహన్‌లాల్ సతీమణి సుచిత్ర కూడా ఉన్నారు. పృథ్వీరాజ్, మోహన్‌లాల్ కుటుంబం మధ్య మంచి అనుబంధం ఉంది. రీసెంట్గా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన లూసిఫర్ చిత్రంలోనూ మోహన్‌లాల్ హీరోగా నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout