దిలీప్‌ను తొల‌గించిన మోహ‌న్‌లాల్‌..?

  • IndiaGlitz, [Saturday,October 20 2018]

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో న‌టి భావ‌నను లైంగికంగా వేధించిన కేసులో హీరో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే దిలీప్ బెయిల్‌పై బ‌య‌ట‌కు కూడా వ‌చ్చారు. చాలా రోజుల పాటు వివాదం కొన‌సాగింది. అయితే ఆసోసియేష‌న్ ఆఫ్ మల‌యాళం మూవీ ఆర్టిస్ట్స్‌(అమ్మ‌) నుండి దిలీప్‌ను తొల‌గిస్తున్న‌ట్లు మోహ‌న్‌లాల్ ప్ర‌క‌టించారు.

దిలీప్ పంపిన రాజీనామా లేఖ‌ను ఆయ‌న ఆమోదించారు. దీనిపై మోహ‌న్‌లాల్ స్పందిస్తూ 'నేను దిలీప్‌ను పిలిచి అమ్మ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌మ‌ని అడిగాను. ఆయ‌న సంత‌కం చేసిన రాజీనామా లేఖ‌ను పంపారు. ఈ వివాదంలో న‌న్ను అన‌వ‌స‌రంగా నిందిస్తున్నారు' అంటూ ఆయ‌న అన్నారు.

వివాద స‌మ‌యంలో అమ్మ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన దిలీప్ బెయిల్‌పై బ‌య‌ట‌కు రాగానే మ‌ళ్లీ స‌భ్య‌త్వం ఇచ్చారు. దీంతో న‌టి భావ‌న‌.. ఆమెకు మద్దతుగా రిమా కలింగల్‌, రమ్య నంబిసన్‌, గీత్‌ మోహన్‌దాస్ అమ్మ నుండి త‌ప్పుకున్నారు. దిలీప్‌కు మోహ‌న్‌లాల్ మ‌ద్ధ‌తు ఇస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు దిలీప్ రాజీనామాతో వివాదం ఓ కొలిక్కి వ‌చ్చింది.

More News

భారీ చేజ్‌లో ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'సాహో'. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

మీటూ పై ర‌జ‌నీ స్పంద‌న‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మీ టూ ఉద్య‌మంపై త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. నిన్న‌టితో పేట్ట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఆయ‌న నేడు చెన్నై చేరుకున్నారు.

నాగ్, ధ‌నుష్ టైటిల్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు కింగ్ నాగార్జున ఇప్పుడు త‌మిళంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున‌తో క‌లిసి నటిస్తూనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు ధ‌నుష్‌.

ప్రేక్ష‌కులను ఆలోచింపజేసే చిత్రం 'రంగు' - హీరో త‌నీష్

న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో  యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు,

నవంబర్ 16న 'టాక్సీవాలా' రిలీజ్

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా.