భీముడుగా మోహన్ లాల్...

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ 'మ‌హాభార‌తం' సినిమా చేస్తున్నాడు. ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ వెయ్యి కోట్ల రూపాయల‌తో రూపొందుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగ‌నుంది. 2018 సెప్టెంబ‌ర్ నుండి సినిమా సెట్స్ లోకి వెళుతుంది. యు.ఎ.ఇ.కి చెందిన భార‌త సంత‌తి వ్య‌క్తి డా.బి.ఆర్‌.శెట్టి ఈ సినిమాను 150 మిలియ‌న్‌డాల‌ర్స్‌ను ఖ‌ర్చు పెట్టి రూపొందిస్తాడ‌ట‌. అంటే అక్ష‌రాల వెయ్యికోట్లు. ఈ సినిమాను యాడ్ ఫిలింమేక‌ర్ వి.ఎ.శ్రీకుమార్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు.
రెండు భాగాలుగా రూపొంద‌నున్న మ‌హాభార‌తం చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిస్తార‌ట‌. మిగ‌తా భార‌తీయ భాష‌ల్లోకి అనువ‌దిస్తార‌ట‌. ఇండియ‌న్ సినిమాలోని బెస్ట్ న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఈ సినిమాలో వ‌ర్క్‌చేయ‌నున్నారు. అంద‌రి కంటే ముందుగా సినిమా కోసం ఎంపికైన న‌టుడు మోహ‌న్‌లాల్‌. ఇంత‌కు మోహ‌న్‌లాల్ ఏ పాత్ర పోషిస్తాడ‌నే ఆస‌క్తి అందిలోనూ నెల‌కొంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ భీముడు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. మ‌రి కృష్ణుడు, ధ‌ర్మ‌రాజు, అర్జునుడు, న‌కులుడు, స‌హ‌దేవుడుగా ఎవ‌రు న‌టిస్తార‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.