డిసెంబర్ లో మోహన్ లాల్ 'మన్యం పులి'
Send us your feedback to audioarticles@vaarta.com
మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే కాదు మోహన్ లాల్ కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖనిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల రిత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటోన్న మన్యం పులి` తెలుగులో సైతం సెంట్ పర్సెంట్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. .దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీసుందర్, కెమెరా : షాజీ కుమార్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com